సాధారణంగా చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. టీ తాగకపోతే వారికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. టీ కి భారతీయులు అలా అలవాటు పడ్డారు. కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా టీ ప్రియులు ఉన్నారు. వీరు రోజుకు చాలా కప్పుల టీని తాగుతుంటారు. అయితే టీ ఇష్టపడే చాలా మంది దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల గురించి మాత్రం అసలు పట్టించుకోరు. టీ ని తాగితే అసలు ఏమవుతుంది..? ఎంత పరిధిలో తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మనం రోజు తాగే టీ లో కెఫిన్, షుగర్ రెండూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి వల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజుకు మీరు ఐదు నుంచి పది కప్పుల వరకు టీ తాగుతున్నారు అంటే మీరు పొరపాటు చేస్తున్నట్టే లెక్క. టీ అధికంగా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ తాగడం వల్ల ఎలాంటి సమస్య లేదు. కానీ మనం ఒక పరిమితికి మించి టీ తాగితేనే అసలు సమస్య మొదలవుతుంది. అధిక టీ తాగడం వల్ల మలబద్ధకం, గుండెలో మంట, ప్రేగులపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. అదేవిధంగా ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు సంభవించే అవకాశం ఉంది. టీ లో చక్కర శాతం చాలా అధికంగా ఉంటుంది. రోజులో చాలా కప్పుల టీ తాగడం వల్ల ఎక్కువగా చక్కెరని తీసుకోవడం జరుగుతుంది. దీంతో మధుమేహానికి దారి తీసే అవకాశముంది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల అది కొవ్వుగా మారుతుంది.
Advertisement
Also Read : నోటి దుర్వాసనను నివారించడానికి ఈ చిట్కాలను తప్పక పాటించండి..!
ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకు పోతుంది అనే విషయం చాలామందికి తెలియదు. ఇక అలాంటి సమయంలో బరువు తగ్గడం చాలా కష్టంగా మారుతుంది. అదేవిధంగా టీ లో కెఫీన్ అధికంగా ఉంటుంది. రిప్రెషన్ వంటి అనుభూతిని ఇస్తుంది. టీ తీసుకొని రోజుల్లో తలనొప్పిని కూడా ఎదుర్కోవచ్చు. ఇది నిద్ర విధానాలను ప్రతికూలం చేస్తుంది. అతిగా కాకుండా రోజులో రెండు లేదా మూడు కప్పుల టీ ని మాత్రం తాగవచ్చు. అది కూడా కాస్త తక్కువ చక్కెర వేసుకొని తాగడం ఉత్తమం. ఆ అలవాటును అదుపు చేసుకోలేని వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జాగ్రత్త సుమా..!
Also Read : పిల్లల ముందు… తల్లిదండ్రులు అసలు చేయకూడని పనులు ఏంటో మీకు తెలుసా?