సాధారణంగా ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ మొబైల్ ఫోన్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. మొబైల్ నిత్యవసర వస్తువుగా మారింది. ప్రతి సమాచారమును చేరవేసేందుకు, టైం వేస్ట్ కాకుండా ప్రతి విషయాన్ని సేవ్ చేసుకుంటాం. పండుగలకు ఉత్సవాలకు విహారయాత్రలకు వెళ్లినప్పుడు మనం తీసుకున్న తీపి గుర్తులుగా ఉండే ఫోటోలను సెల్ ఫోన్ లో భద్రపరచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన ఫైల్స్, మెయిల్స్, మెసేజెస్ తదితర వాటిని సేవ్ చేసుకోవచ్చు. సెల్ ఫోన్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్ అతిగా వాడితే కనిపించే ప్రతికూల ప్రభావాల గురించి ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.
Advertisement
అతి చిన్న వయసులో ఫోన్ వాడడం వలన కలిగే సమస్యలు ఏంటో అమెరికాకు చెందిన సేపియన్ ల్యాబ్ అధ్యయనం చేసింది. వరల్డ్ లో 40 కి పైగా దేశాల నుంచి 27,969 మంది పాల్గొన్నారు. దాదాపు 18-24 ఏళ్ల మధ్య వయసున్న యువతి, యువకుల అభిప్రాయాలను తీసుకొని అధ్యయనం జరిపింది. ఈ అధ్యాయంలో భారతదేశం నుంచి 4 వేల మంది పాల్గొన్నారు. 47 అంశాలపై సర్వే ప్రారంభించారు. సర్వే ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేశారు. అయితే ఈ సర్వే ద్వారా కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. 6 సంవత్సరాల పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు ఫోన్ వాడడం వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తేలింది.
Advertisement
18 సంవత్సరాల నుంచి ఆపై వయసు వారు అతిగా ఫోన్ వాడడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం, కలివిడితనం వారి భావ ప్రకటన మెరుగు పరుచుకోలేకపోవడం జరుగుతాయని తెలిపారు. మరికొందరిలో ఆత్మహత్యలకు ప్రేరేపితమయ్యే ఆలోచనలు ఎక్కువగా ఉత్తేజం అవుతాయని తేలింది. అమ్మాయిలకు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల మానసిక, శారీరకంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువకుల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించడం కోల్పోతారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఉంది. కాబట్టి ఇది మన దేశానికి ఒక హెచ్చరిక వంటిది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్తులో ముప్పు వాటిల్లుతుందని సర్వే ద్వారా నిరూపితమైంది. వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రోహిత్ ట్రాప్లో పడ్డాడు.. ఆ మిస్టేక్ టీమిండియా కొంప ముంచింది !