సాధారణంగా చాలా మంది హీరోలు ఎలాంటి పాత్రలైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటారు. కొంతమంది ఆ పాత్రకు వారు తప్ప మరెవరు ప్రాణం పోయలేరు అనేలా జీవిస్తారు. రొ**మాంటిక్ హీరోగా, మన్మధుడిగా పేర్లు తెచ్చుకున్నప్పటికీ భక్తి రస చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు నాగార్జున. నిన్నే పెళ్లాడుతా లాంటి రొమాంటిక్ తర్వాత వెంటనే అన్నమయ్య అనే సినిమా చేశారు నాగార్జున. ఆ సమయంలో రిస్క్ ఎందుకు అని ఎంతమంది చెప్పిన నాగార్జున అన్నమయ్య చేసి తనను తాను నటుడుగా నిరూపించుకున్నారు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అలాగే రామదాసు, ఓం నమో వెంకటేశాయ, షిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాల్లో నటించి మెప్పించారు నాగార్జున. అయితే నాగార్జున దేవుడు పాత్రలో నటించిన సినిమాలు కూడా రెండు ఉన్నాయి. నాగార్జున కృష్ణార్జున అనే సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా నటించారు. ఈ సినిమాలో నాగార్జున కృష్ణుడి గెటప్ లో కనిపించలేదు.
Advertisement
అలాగే నాగార్జున శివుడు పాత్రలోనూ నటించారు. నాగార్జున శివుని పాత్రలో కనిపించిన సినిమా జగద్గురు ఆది శంకర సినిమాలో నాగార్జున ఓ చిన్న పాత్రలో కనిపించారు. శివుడి తరహా పాత్రలో నాగార్జున కనిపించారు. ఆదిశంకరకు కనువిప్పు చేసే చిన్న సన్నివేశంలో నాగార్జున నటించారు. సినిమాలో ఈ సన్నివేశంలో నాగార్జున అద్భుతంగా నటించారు. సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు, శ్రీహరి కూడా నటించారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!