వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ చెల్లిగా మంచి పాపులారిటీని సంపాదించుకుంది షర్మిల. తెలంగాణలో పార్టీ పెట్టినా.. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి ఏపీలో పని చేస్తున్నప్పటికీ.. వైఎస్ కూతురుగా మంచి గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడానికి షర్మిల కూడా ఒక కారణం అనే చెప్పవచ్చు.
Advertisement
ముఖ్యంగా సీఎం జగన్ జైలులో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేయడం.. పలు సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. కొన్ని కారణాలతో అన్నతో విభేదాలు తలెత్తి తెలంగాణలో వైఎస్సార్టీపీ ఏర్పాటు చేశారు. పాదయాత్రలు చేశారు. కానీ ప్రజల నుంచి ఆదరణ లభించలేదు. ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో కలిపారు. ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్నారు. షర్మిల పర్సనల్ విషయం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. షర్మిల క్రమ శిక్షణ కలిగిన నేత ఇంట్లో పుట్టింది. క్రిస్టియన్ ఫ్యామిలీ. షర్మిల తల్లిదండ్రులను విభేదించి 1999లో బ్రాహ్మణ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇందుకోసం అమెరికాకు వెళ్లింది. ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని తరువాత తన తండ్రి వైఎస్సార్ కి విషయం చెప్పింది. స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Advertisement
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో పుట్టిన షర్మిల ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లింది. మొదటి సారి బ్రదర్ అనిల్ ను కలిసిందట. షర్మిల స్నేహితులు ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ కి అనిల్ కూడా వచ్చారట. ఈ మీటింగ్ తరువాత ఇద్దరూ కలిసేవారు. ఆ సమయంలోనే బ్రదర్ అనిల్ ప్రేమలో పడింది షర్మిల. అనిల్ షర్మిలకు ప్రపోజ్ చేశాడట. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అనిల్.. క్రైస్తవ మతానికి చెందిన షర్మిల ప్రేమించుకోవడం అప్పట్లో వైఎస్ కుటుంబంలో పెను సంచలనంగా మారిందట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అంటే చాలా ప్రేమ. షర్మిలకు జీసెస్ అంటే చాలా ఇష్టం. ఆమె ఏం కావాలన్నా తండ్రిని, తరువాత దేవుడిని మాత్రమే కోరుకునేవారు.
ఇంత దైవభక్తి ఉన్న షర్మిల తమ మతం కానీ.. సంప్రదాయ బ్రాహ్మణుడిని ప్రేమించింది. ఒకరోజు తన తల్లి ద్వారా ఈ విషయాన్నివైఎస్సార్ కి చెప్పిందట. వైఎస్సార్ షాక్ కి గురయ్యాడట. తన జీవితంలో ఎన్నడూ బాధపడనంతగా బాధపడ్డాడట. అనిల్ గురించి తెలుసుకుని వేర్వేరు మతాల వారు కలిసి ఉండలేరని కూతురుకు నచ్చజెప్పారట. పెళ్లి చేసుకుంటూ.. తన తరపున, అటు విజయమ్మ తరపున వారు దూరమవుతారని తెలిపారట. కానీ షర్మిల మాత్రం తాను పద్దతుల విషయంలో ఎలాగైనా ఉండగలనని సర్దుకు పోతానని చెప్పిందట. అనిల్ తో పెళ్లికి వైఎస్సార్ అంగీకరించకపోవడంతో షర్మిల మానసికంగా ఇబ్బంది పడిందట. ఈ తరుణంలోనే కొద్ది రోజుల పాటు అమెరికా వెళ్తానని తండ్రికి చెప్పిందట. అమెరికా వెళ్తే తన కూతురు ఇక్కడి విషయాలు మరిచిపోతుందని వైఎస్సార్ అంగీకరించాడట. కానీ షర్మిల అమెరికాలో అనిల్ ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత తండ్రికి ఫోన్ చెప్పడంతో షాక్ అయ్యాడట. ఆ తరువాత రెండు కుటుంబాలు కలిసి పోయాయి. ఇక అనిల్ కొద్ది రోజుల తరువాత క్రైస్తవ మతం స్వీకరించాడు. వైఎస్సార్ కి నచ్చిన, మెచ్చిన అల్లుడిగా మారిపోయారట. షర్మిల రాజకీయాల్లో కూడా అనిల్ పుల్ సపోర్టు చేస్తారట.