Home » మొండి వ్యాధులను నయం చేసే ఈ ఆలయం గురించి మీకు తెలుసా ?

మొండి వ్యాధులను నయం చేసే ఈ ఆలయం గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా  చాలామంది  దేవుడిని నమ్ముతుంటారు.  దేవుని అనుగ్రహం ఉంటే మన కష్టాలు తొలగిపోతాయని ఫీల్ అవుతారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వస్తే దేవుడిని దర్శించుకుంటే ఆ కష్టాలు తీరుతాయని భావిస్తారు. అయితే మొండి వ్యాధుల బారిన పడితే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతమంది డాక్టర్లను కలిసినా కొన్ని సందర్భాల్లో మొండి వ్యాధులకు చెక్ పెట్టడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. అయితే ఒక ఆలయాన్ని సందర్శించడం ద్వారా మొండి వ్యాధులు సులువుగా దూరమయ్యే అవకాశం ఉంటుంది.


వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఒక ఆలయాన్ని సందర్శిస్తే మంచి జరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని ధూళిపట్ట మండలం లో ఉన్న బెక్కల్ లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ ఉన్న శివాలయంను దర్శించుకుంటే ఎలాంటి మొండి వ్యాధి అయినా నయమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు రోగ నివారణ క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడి ఆలయం చుట్టూ ఉండే వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. శివరాత్రి సమయంలో ఈ ఆలయం దగ్గర బ్రహ్మోత్సవాలు గ్రాండ్ గా జరుగుతాయి.

Advertisement

Advertisement


ఈ ఆలయం చెట్టూ ఎన్నో ఉపాలయాలు ఉండగా ఇక్కడ ఉన్న గుట్టపై కొన్నేళ్ల క్రితం హనుమంతుని స్వామి ఆలయంను నిర్మించారు. రైలు, బస్సు ఇతర మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకోవడం సాధ్యమవుతుంది. ఈ ఆలయాన్ని భక్తులు రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. సాధారణ వైద్యం ద్వారా ఫలితం లేని వాళ్ళు ఈ ఆలయంను సందర్శిస్తే మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని కొంతమంది వైద్యనాథుని ఆలయం అని కూడా పిలుస్తారు. ఏడాదంతా ఈ ఆలయం భక్తులతో కితకితలాడుతూ ఉంటుంది. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading