Home » ఎన్టీఆర్ ఫ్యామిలీకి విజయశాంతికి ఉన్న రెండు బంధుత్వాల గురించి మీకు తెలుసా ?

ఎన్టీఆర్ ఫ్యామిలీకి విజయశాంతికి ఉన్న రెండు బంధుత్వాల గురించి మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినీ రంగంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి పలు సూపర్ డూపర్ హిట్లు సాధించిన ఏకైక సూపర్ స్టార్ లేడీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. విజయశాంతి అనే చెప్పాలి. ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోలకు ధీటుగా పలు యాక్షన్ మూవీస్ లలో నటించి వారికి తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నటువంటి ఘనత నటి విజయశాంతికే దక్కుతుంది.  ఏ  స్టార్స్ అవసరం లేకుండా హీరోలకు ధీటుగా రాణించి మంచి సక్సెస్ సాధించిన  ఏకైక హీరోయిన్ విజయశాంతి.

Vijayshanthi-and-NTR

Advertisement

 

సినీ రంగంలో పలు విజయాలను అందుకున్న విజయశాంతి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇటీవలే  45 సంవత్సరాలు పూర్తి చేసుకొని 46  ఏళ్లు పూర్తి అయింది. విజయశాంతి 1966 జూన్ 24న వరంగల్ లో జన్మించారు. ఇక ఆ తరువాత ఆమె మద్రాస్ లో పెరిగారు. విజయశాంతి పిన్ని విజయ లలిత అప్పట్లో తెలుగు సినీ నటి.  విజయశాంతి అసలు పేరు శాంతి. తన పిన్ని పేరులోని విజయ లలిత పేరు నుంచి విజయను తీసుకున్నారు. విజయశాంతి ఏడేళ్లకే బాలనటిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు లో సూపర్ స్టార్ కృష్ణతో కిలాడీ కృష్ణుడు మూవీలో తొలిసారిగా నటించింది.  ఈ సినిమాకి విజయనిర్మల దర్శకురాలుగా వ్యవహరించారు.

Advertisement

తన సినీ కెరీర్  ప్రారంభంలో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైంది విజయశాంతి. ఆ తరువాత తిరుగులేని స్టార్ హీరోయిన్ అయ్యారు. 1987లో మోటూరి శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విజయశాంతి. బాలకృష్ణ ద్వారా శ్రీనివాస్ ఆమెకు  పరిచయమయ్యాడు. ఆ తరువాత  కొన్నాళ్ల పాటు ఆమెకు మేనేజర్ గా కూడా పని చేశారు. శ్రీనివాస్ కి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో బంధుత్వం ఉంది. ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావుకు సొంతం మేనళ్లుడు శ్రీనివాస్. అలాగే ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఫ్యామిలీతో కూడా ఆయనకు చుట్టరికం ఉంది. విజయశాంతి భర్తకి  ఎన్టీఆర్ ఫ్యామిలీతో రెండు వైపులా బంధుత్వం ఉంది. విజయశాంతి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు. మళ్లీ ఇప్పుడు NKR 21 మూవీలో విలన్ గా నటించనున్నట్టు సమాచారం. 

Visitors Are Also Reading