ఆర్.మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నటుడిగా, రైటర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ రంగంో ఎన్నో సేవలందిస్తున్నాడు మాధవ్. ప్రస్తుతం ఆయన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మంచి వ్యక్తిత్వం కలిగిన మాధవన్ భారతీయ సంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తాడు.
Advertisement
మాధవన్ కుమారుడు కూడా హిందూ సంప్రదాయాలను ఆచరిస్తాడు. రంగనాథన్ మాధవన్ 1970, జూన్ 01న భారతదేశంలోని ఝంషెడ్ పూర్ లో ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్ెరి రంగనాథన్ అయ్యంగార్ టాటా స్టీల్ లో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ కాగా అతని తల్లి సరోజ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పని చేశారు. మాధవన్ తల్లి సరోజా నుంచి చాలా విలువలను నేర్చుకున్నాడు. ముఖ్యంగా జీవితంలో పాటించాల్సిన మూడు జీవిత సూత్రాలను తెలుసుకున్నాడు. వాటిని ఇప్పటికీ తూచా తప్పకుండా అతను పాటిస్తాడు. ఇటీవలే ఓ ఈవెంట్ లో ఈ మూడు జీవిత సూత్రాల గురించి అతను పంచుకున్నాడు. అవి ఏంటో తెలుసుకుందాం.
Advertisement
- ఉద్దేశపూర్వకంగా ఎవ్వరినీ నొప్పించకూడదు.
- ఎవ్వరినీ ఆర్థికంగా మోసం చేయకూడదు
- ఏ వృత్తి చేసే వారైనా ప్రతీ ఒక్కరినీ గౌరవించాలి.
ఈ మూడు సూత్రాలను తాను జీవితంలో ఎప్పటికీ పాటిస్తానని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో పేస్ బుక్ లో వైరల్ గా మారింది. ఇది చూసిన చాలా మంది ఓ తల్లిగా పిల్లలకు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఇదే అని పేర్కొంటున్నారు. మాధవన్ మన భారతీయ కల్చర్ ని ఎంతో గౌరవిస్తారు అని మరొకరూ కామెంట్ చేశారు. ఉత్తమ తల్లి మీరు పుట్టుకతోనే దేవుడి ఆశీర్వాదాలు పొందారు అని ఇంకొకరూ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!