తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఐదు పదుల వయసు దాటినా కూడా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించే స్పెషాలిటీ ఆయన సొంతం. అలాంటి మహేష్ బాబు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వివాదరహితుడిగా ఉన్నారు. అలాంటి ఆయనకు ఇండస్ట్రీలో బద్ధ శత్రువు ఉన్నారట. మరి ఎంతో మంచి మనసున్న మహేష్ బాబుకు హాని కలిగించింది ఎవరు.. ఆయన ఎందుకు శత్రువు అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు మహేష్ బాబు. అలాంటి ఆయన నటన గురించి మనం మరో విషయం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆయన ఒకప్పుడు అనేక ఇబ్బందులు పడ్డారట. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తే ఆయనను చాలా మంది అనేక రకాలుగా కామెంట్లు చేశారట. మహేష్ బాబు మొహం ఆయనకు యాక్టింగ్ వస్తుందా అని విమర్శించారట. ఒక్కడు సినిమాకి మహేష్ బాబుతో సినిమా చేస్తానని ఒక డైరెక్టర్, ఓ నిర్మాత వద్దకు వెళ్లి స్టోరీ చెప్పారట. దీంట్లో మహేష్ బాబు హీరో అని ఆ నిర్మాతకు చెప్పారట. వెంటనే ఆ నిర్మాత ఆయన హీరో అయితే అసలు సినిమానే చేయను అంటూ మొహం మీద చెప్పేసారట.
ఆయనకు అసలు యాక్టింగ్ రాదు అంటూ అనడంతో ఈ విషయం కాస్త మహేష్ బాబు చెవిలో పడింది. ఇదే మాటను కసిగా తీసుకున్న మహేష్ బాబు ఆ నిర్మాతపై ఎలాగైనా రివేంజ్ తీసుకోవాలని భావించారట. తనకు వచ్చిన సినిమా ఆఫర్లను వదులుకోకుండా నటన చాతుర్యంతో అద్భుతంగా నటించి సూపర్ హిట్లు అందుకుంటూ వచ్చారట. ఆ సమయంలో ఒక్కడు సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయన వరుస ఆఫర్లు వచ్చాయి. తర్వాత ఆ నిర్మాతే మహేష్ బాబు ముందుకు వచ్చి తలదించుకునే పరిస్థితి ఏర్పడిందట. అలా మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ టెన్ హీరోస్ లో ఒక్కరిగా ఉన్నారు. ప్రజెంట్ ఆయన నటించిన గుంటూరు కారం థియేటర్లలోకి రాబోతోంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!