సాధారణంగా అంతా డిజిటల్ యుగమే. ఏ పనులు చేయాలన్నా ల్యాప్ ట్యాప్స్, కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ లోనే ఈజీగా చేసేస్తున్నారు. అయితే ఇలా డెస్క్ జాబ్ చేసే వారికి.. కళ్లపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. దీంతో కళ్లలో మంటలు, మసకబారి పోవడం, ఐ సైట్ వంటివి వస్తూ ఉంటాయి. ఇలా కంటి సమస్యలు వచ్చే వారు.. వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే చూపు మందగించే ప్రమాదం ఉంది. అయితే కళ్ల మంటలు ఉన్న వారు ఎక్కువగా మార్కెట్లో లభించే ఐ డ్రాప్స్ ని వినియోగిస్తూ ఉంటారు. వీటిని ఎక్కువగా ఉపయోగించ కూడదని వైద్యులు చెబుతున్నారు. వైద్యల సలహా మేరకు తప్ప.. వారంతట వాళ్లు వినియోగించకూడదట. ఇలా కళ్ల మంటలతో బాధ పడేవారు ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
కంప్యూటర్స్, ల్యాప్ ట్యాప్స్, టీవీలు, మొబైల్ ఫోన్స్ చూసే వారికి ఎక్కువగా కళ్ల మంటలు రావడం అనేది సాధారణ విషయం. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కంటిపై ఐస్ క్యూబ్స్ ని పెట్టి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా కంటి సమస్యల నుంచి రిలీఫ్ నెస్ పొందవచ్చు. అంతే కాకుండా కంటి నుంచి నీరు కారడం కూడా తగ్గుతుంది.
కంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కోసం చల్లని మిల్క్ లేదా రోజ్ వాటర్ కూడా బాగా ఉపయోగ పడతాయి. చల్లని పాలు లేదా రోజ్ వాటర్ ని ఫ్రిజ్ లో ఉంచాలి. ఇవి చల్లగా అయిన తర్వాత కాటన్ బాల్స్ అందులో ముంచి.. కళ్లపై పెట్టుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు కూడా పోతాయి.