Home » రాజమౌళి దేవుడిని నమ్మరా..? అయినప్పటికీ దేవాలయానికి వెళ్లడానికి కారణాలివేనా ?

రాజమౌళి దేవుడిని నమ్మరా..? అయినప్పటికీ దేవాలయానికి వెళ్లడానికి కారణాలివేనా ?

by Anji
Published: Last Updated on
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సాధారణ కథలతో సైతం అసాధారణ విజయాలను అందుకునే ప్రతిభ జక్కన్నకే సొంతం అనే చెప్పాలి. అయితే రాజమౌళి దేవుడిని, మతాన్ని నమ్మరు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. RRR మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ ఆసక్తికర విషయాలను స్వయంగా వెల్లడించారు. వేర్వేరు సందర్భాల్లో జక్కన్న దేవాలయాల్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

rajamouli

Advertisement

రాజమౌళి తను దేవుడిని నమ్మకపోయినా తనతో ఉండే వ్యక్తుల ఫీలింగ్స్ కి ఎంతో గౌరవం ఇస్తారు. ఈ రీజన్ వల్లనే జక్కన్న అందరి వాడయ్యారు. తాజాగా జక్కన్న బళ్లారిలోని ఓ ఆలయాన్ని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. రాజమౌళి నాస్తికుడు అని తెలిసి చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. జక్కన్న సినిమాల్లో మాత్రం దేవుడిని నమ్మేలా చాలా సీన్లు ఉంటాయి. రాజమౌళి ప్రస్తుతం మహేష్ మూవీతో చాబా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదని రాజమౌళి వెల్లడించడం గమనార్హం.

Advertisement

జక్కన్న సినిమా సినిమాకు తన స్థాయిని మరింత పెంచుకుంటున్నాడు. మహేష్ మూవీకి ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది. రాజమౌళి స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జక్కన్నను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జక్కన్న ఈ సినిమా సెట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పడుతున్నారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని రాజమౌళి ఇటీవలే చెప్పారు. ఈ సినిమా ముహుర్తం ఇదేనంటూ కొత్త తేదీల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం.

Also Read :  జబర్దస్త్ యాంకర్స్ రష్మీ, అనసూయ అలాంటి వాళ్లు.. కిరాక్ ఆర్పీ కామెంట్స్ వైరల్

Visitors Are Also Reading