ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. రోజూ ఆనందంగా మొదలు అవ్వాలని అనుకుంటూ ఉంటారు. పనిలో విజయం కలగాలని రోజంతా హాయిగా ఉండాలని ఇలా ఎన్నో వాటిని అనుకుంటూ ఉంటారు. అయితే గరుడ పురాణంలో ఇలాంటి అనేక విషయాలు గురించి చెప్పబడింది. ప్రతిరోజూ ఉదయం వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులు చూడొచ్చట. మనసు సంతోషంగా ఉంటుంది. రోజంతా శక్తిని అనుభవిస్తాడు. వీటిని కనుక మీరు మీ దినచర్యలు చేర్చుకున్నట్లైతే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… ఉదయాన్నే తలస్నానం చేయడం వలన శారీరకంగానే కాకుండా మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి.
Advertisement
నిద్రలేచిన వెంటనే స్నానం చేయడం వలన రిఫ్రెష్ గా ఉంటుంది. స్నానం చేసాక ఇష్ట దేవత లేదా దైవాన్ని పూజించడం మంచిది. ఉదయాన్నే పూజ చేయడం వలన రోజంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే పూర్వికులు గురించి ధ్యానం చేయాలి వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది గరుడ పురాణం ప్రకారం ఉదయం ధ్యానంలో కొంత సమయాన్ని గడిపితే మంచిదట దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడుతుంది.
Advertisement
Also read:
Also read:
అలానే గరుడ పురాణం ప్రకారం ఉదయాన్నే ఆవు లేదా కుక్కకు రొట్టెలు పెట్టడం మంచిది. పక్షులకు ఆహారం పెడితే భగవంతునితో పాటుగా పూర్వికులు అనుగ్రహం కూడా లభిస్తుంది ఉదయాన్నే మంత్రాలన్నీ పట్టిస్తే మంచి జరుగుతుంది గాయత్రి మంత్రం కానీ ఓంకారం కానీ జపించొచ్చు. ఇలా చేయడం వలన ఎంతో ప్రశాంతత కలుగుతుంది మానసిక ప్రశాంతతను మీరు ఇలా పొందవచ్చు. మరి చూశారు కదా.. ఇకమీదట ఇలా ఫాలో అయిపోండి అనేక మార్పులు మీరు గమనిస్తారు హాయిగా సంతోషంగా ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి