Home » ఇంటికి ఆ దిశలో చెప్పులు ఉంచితే అప్పుల పాలవ్వడం ఖాయం..!

ఇంటికి ఆ దిశలో చెప్పులు ఉంచితే అప్పుల పాలవ్వడం ఖాయం..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది వాస్తును పక్కాగా నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. వాస్తుకు సంబంధించిన కొన్ని సానుకూల ప్రతికూల నియమాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రంలో నిర్దేశించిన నిబంధనలను పట్టించుకోకుంటే.. ఆ ఇంట్లో నివసించే వారి జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇంట్లో వాస్తు శాస్త్రాలు సరిగ్గా పాటించకపోతే ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంటుంది. కొన్ని ఇళ్లల్లో గొడవ కూడా చేస్తుంది. వాస్తు శాస్త్రంలో మనం బూట్లు లేదా చెప్పులు ఎలాంటి ఉంచుకోవాలో తెలుసుకోవాలి. 

Advertisement

ఇందుకోసం కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. ఇంట్లో అవసరమైన ప్రదేశాల్లో మీ బూట్లూ ఉంచకూడదు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి. బూట్లు, చెప్పులు ఎప్పుడు కూడా ఇంటికి ఉత్తరం, తూర్పు దిశకు ఉంచకూడదు. ఈ దిశ లక్ష్మీదేవికి సంబంధించిది. ఇంటికి ప్రతికూల శక్తిని తెస్తుందని చాలా వరకు నమ్ముతారు. ఈ దిక్కుల్లో పాదరక్షలు ఉంచిన వారిపై దేవతా ఆగ్రహానికి గురవుతుందని చెబుతారు. బూట్లు లేదా స్లిప్పర్స్ క్లోజ్డ్ క్యాబినెట్స్, బాక్సుల్లో ఉంచాలి. ఇలా ఉంచడం చాలా మంచిది. ఎందుంటే క్లోజ్డ్ క్యాబినెట్ ప్రతికూల భావోద్వేగాల నిర్మాణాన్ని నియంత్రిస్తాయి.  

Advertisement

Also Read :  అక్కడ లభించే తేనె చేదుగా ఉంటుందనే విషయం మీకు తెలుసా ? 

ఇంటి తలుపుల వద్ద బూట్లు లేదా చెప్పులు కుప్పగా మాత్రం అస్సలు ఉంచకూడదట. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో వ్యక్తుల మధ్య ఘర్షణకు దారి తీస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మీ బూట్లను తిరిగి ఉపయోగించే ముందు వాటిని ఎల్లప్పుడూ శుభ్రం చేయండి. అదనంగా బూట్లు ఉంచుకునే  సెల్ప్ ను కూడా శుభ్రం చేయాలి. దీంతో మానసిక చికాకును నివారించవచ్చు. డ్రెస్సింగ్ చేసేటప్పుడు షూ రాక్ ని మీ బెడ్ రూమ్ కు తరలించడం మంచి ఆలోచన అని మీరు అనుకోవచ్చు. కానీ అది మీ వైవాహిక జీవితానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి మీ యొక్క గదిలో షూ స్టాండ్ ఉంచకూడదు. 

Also Read :  రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా… అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

Visitors Are Also Reading