Home » మీ రిలేషన్ షిప్ లో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

మీ రిలేషన్ షిప్ లో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

by Anji
Ad

సాధారణంగా భార్యభర్తల బంధం ఎంత బలమైనదో అంతే సున్నితమైనది కూడా. వారి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు చినికి గాలి వానలా మారి పెద్ద అగాథాన్ని సృష్టిస్తాయి. కొన్నిసార్లు దంపతులు విడిపోయే పరిస్థితి కూడా సంభవించవచ్చు. దాంపత్య జీవితంలో ఇద్దరూ సమానమనే విషయాన్ని గుర్తించాలి. ఒకరి ఇష్టాయిస్టాలను మరొకరు గౌవరించుకోవాలి. ప్రేమికుల విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఎవ్వరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు ముందు వారు చేసే పనులు బాగానే అనిపిస్తాయి. రిలేషన్ షిప్ లో కాలం గడుస్తున్న కొద్ది ఆ పనులే చిరాకు కలిగిస్తుంటాయి. దీనికి ఫలితంగా ఇద్దరి మధ్య భేదాలు దారి తీస్తాయి. 

Advertisement

ఏదైనా బంధం దృఢంగా ఉండాలంటే.. నమ్మకం, గౌరవం, అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. సంబంధాలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని నిర్వహించడం అంత సులభం కాదు. మనం ఇష్టపడే వ్యక్తులతో సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి కొన్ని విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ భాగస్వామిని అనుమానించకండి. ఏదైనా సంబంధానికి పునాది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. రిలేషన్ ని బలంగా ఉంచుకోవడానికి భాగస్వామిని విశ్వసించడం చాలా ముఖ్యం. చిన్న విషయాలపై అనవసరంగా అనుమానించే అలవాటు సంబంధం పై ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం ద్వారా క్రమ క్రమంగా అపార్థాలు పెరుగుతాయి. బంధాలు విచ్ఛిన్నమవుతాయి. పార్ట్ నర్స్ తో సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి వారిని నమ్మాలి. 

Advertisement

Also Read :  భార్య సంపాదన భర్త వాడుకుంటే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ?

కొంత మందికి అసలు విషయాలను మరిచిపోయే అలవాటు ఉంటుంది. కాలక్రమేణా ఇది పెరుగుతున్న సంబంధాన్ని విషపూరితం చేస్తుంది. దూరాన్ని సృష్టిస్తుంది. ఏ విషయమైనా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. సమస్య వస్తే పరిష్కరించుకోవాలి. వీటిని నిర్లక్ష్యం చేస్తే రిలేషన్ లో అపార్థాలు పెరుగుతాయి. ఏదైనా సంబంధాన్ని బలంగా ఉంచుకోవానికి ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. కోపంతో ఏదైనా సూటిగా మాట్లాడటం, ఇతర వ్యక్తుల ముందు భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేయకూడదు. సంబంధం పాతది, బలమైంది అయినప్పటికీ..లైఫ్ పార్ట్ నర్ ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉండాలి. కోపం లేదా గొడవలు జరిగితే పరిమితులను దాటకూడదు. ఎందుకంటే..?  కోపంలో ఉన్నప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడుతుంటాం. ఇది రిలేషన్ పై పెను ప్రభావం చూపే అవకాశముంది. 

Also Read :   నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం.. రామకృష్ణకి తప్పిన ముప్పు..!

Visitors Are Also Reading