Home » శివరాత్రి రోజు ఈ పనులను అస్సలు చేయకండి..!

శివరాత్రి రోజు ఈ పనులను అస్సలు చేయకండి..!

by Anji
Ad

శివరాత్రి హిందువులకు పెద్ద పండుగ అనే చెప్పవచ్చు. శివుడు లింగాకృతి పొందిన రోజు, అందుకే శివరాత్రి రోజున దేశం అంతా శివాలయాల్లో శివపూజలు అందుకుంటాడు శివయ్య. ముఖ్యంగా శివరాత్రి పండుగ రోజు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

శివరాత్రి రోజు మద్యం మాంసం అసలు ముట్టుకోకూడదు. అదేవిధంగా ఎలాంటి పరిస్థితిలో అయినా ఉదయం స్నానం చేయాలి. ఉదయం 8 లోపు కచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి. అదేవిధంగా చెంబుడు నీల్లని అయినా స్వామికి అభిషేకం చేయాలి. గేదెపాల కంటే ఆవుపాలు మాత్రమే అభిషేకం చేయాలి. ఇక గర్భగుడికి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని అభిషేకం చేయాలి. 

Advertisement

Manam News

మహిళలు అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగం తాకకూడదు. మన శరీరం నుంచి అభిషేకం చేసే సమయంలో చెమటలు కానీ వెంట్రుక కానీ శివుడిపై పడకుండా చూడాలి. శివుడికి దేవాలయానికి మొగలిపువ్వుని తీసుకురాకూడదు. ఇది స్వామికి ఇవ్వకండి. పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో అభిషేకం అస్సలు చేయకండి. శివరాత్రి రోజు భార్య, భర్తలు సంభోగం చేయకూడదు. ఇలా చేస్తే పాపాలు మూటగట్టుకుంటారట. పేదలకు దానం చేయండి. అదేవిధంగా తోటకూర దానం చేస్తే చాలా మంచిది.  

Also Read :  ఇంటికి ఆ దిశలో చెప్పులు ఉంచితే అప్పుల పాలవ్వడం ఖాయం..!

Visitors Are Also Reading