సాధారణంగా భారతదేశమంటేనే గుళ్లు, గోపురాలు, జ్యోతిష్యాలు, శాస్త్రాలు బాగా నమ్ముతూ ఉంటారు.. ముఖ్యంగా చెప్పాలంటే మూఢనమ్మకాలకు పుట్టినిల్లు భారతదేశం అని గట్టిగా చెప్పవచ్చు. అలాంటి భారతదేశంలో పూర్వకాలం నుంచి ఎన్నో మూఢనమ్మకాలను మనం నమ్ముతూ వస్తున్నాం. కానీ ఆ మూఢనమ్మకాల వెనకే సైన్స్ కూడా దాగి ఉందని ఎవరికి తెలియదు.
Advertisement
also read:అరటి ఆకులో తింటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది చిన్నపిల్లలకు కానీ ఇంకెవరికైనా దిష్టి తగిలిందని చాలామంది ఉప్పుతో తీస్తూ ఉంటారు.. మరి ఉప్పుతోనే దిష్టి ఎందుకు తీస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచంలోని అన్ని మతాల, ఆచార వ్యవహారాల్లో కూడా ఉప్పును శుభ్రత కోసం దుష్టశక్తులను సాగనంపడానికి ఉపయోగిస్తారు. ఇందులో మగవాళ్ళు అయితే ఉప్పును వేరొకరి చేతి నుండి కచ్చితంగా తీసుకోరు. యూరప్ లో చాలామంది ఉప్పును అపశకునంగా భావించి ఉప్పుతో జాగ్రత్తగా ఉంటారు. ఇక మన భారతదేశంలో అయితే ఈ ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
Advertisement
ముఖ్యంగా చిన్న పిల్లలకు ఏదైనా గాలి తాకి ఏడుస్తున్నారని భావిస్తే, వారి చుట్టూ ఉప్పును తిప్పి నోట్లో కొంత వేస్తారు ఇది మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉంది. ఇస్లాం, క్రైస్తవం,బౌద్ధం, హిందూ అన్ని మతాల్లో ఉప్పును వివిధ రకాలుగా వాడతారు. సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఉప్పు క్రిములను దూరంగా ఉంచుతుంది. ఉప్పు దయ్యాలను తరుముతుంది అనేది ఒక మూఢనమ్మకం. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందని నమ్ముతారు. అందుకే పిల్లలకు దిష్టి తగిలినప్పుడు ఉప్పుతో తీస్తూ ఉంటారు. ఇది పురాతన కాలం నుంచి కొనసాగుతున్న తంతు..
also read: