భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ చెల్లింపుల పాత్ర ఎంతో ఉంది. కరోనా పుణ్యమా అని అవి మరింత పెరిగాయి. తోలుతా నెట్ బ్యాంకింగ్ నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు డిజిటల్ వాలెట్లు, యూపీఐల వరకు చెల్లింపు విధానంలో ఎంతో మార్పు వచ్చింది. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఈ తరుణంలో మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ మద్యం దుకాణాల్లో ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభమైంది.
రాష్ట్ర అబ్కారీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ నేడు మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. తొలి విడతలో 11 మద్యం దుకాణాల్లో ఆన్లైన్ లావాదేవీలు ఉంటాయని రజత్ భార్గవ వెల్లడించారు. అనంతరం మూడు నెలల్లో అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రవేశపెడతామని చెప్పారు. మద్యం దుకాణాల్లో ఆన్లైన్ చెల్లింపుల కోసం ఎస్బిఐ సహకారం తీసుకుంటున్నామని వివరించారు.
Advertisement
Advertisement
డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలకు ఆదనపు చార్జీలు ఉండవని రజత్ భార్గవ స్పష్టం చేశారు. క్రెడిట్ కార్డు లావాదేవీలకు మాత్రం నిబంధనల ప్రకారం చార్జీలు ఉంటాయని తెలిపారు. మందుబాబుల రిక్వెస్ట్ లతో పాటు క్యాషియర్ లా చేతివాటా, నగదు లావాదేవీల్లో వ్యత్యాసానికి సంబంధించి ఫిర్యాదులు అందడంతో, డిజిటల్ పేమెంట్స్ కు ప్రభుత్వం మొగ్గు చూపిందని చెప్పాలి.
READ ALSO : “నరసింహ నాయుడు” సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీసారని తెలుసా? ఎక్కడ జరిగిందంటే?