మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇందులో కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన ఓ నటుడు ఒక సివిల్స్ టాపర్ అని మీకు తెలుసా..? అతను ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
శంకర్ దాదా MBBS మూవీలో నటించిన నటుడు యెడవెల్లి అక్షయ్ కుమార్. ఈయన ఒక సివిల్ టాపర్. అయితే ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను సివిల్స్ టాపర్ గా నిలిచినప్పటికీ సైడ్ ట్రాక్ వల్లే తాను సినిమాలు బాగా చూసేవాడిని. వారానికి ఒక సినిమా అయితే పక్కా చూసే వాడిని. తాను సినిమాలు చూస్తానని మా ఫాదర్ కి తెలియదు. సినిమాల్లో కొన్ని సినిమాలు అయితేనే తనకు ఇష్టమని.. పిచ్చి పిచ్చి సినిమాలు అయితే అస్సలు ఇష్టపడను అని వెల్లడించారు. లవ్ స్టోరీ సినిమాలు అస్సలు నచ్చవన్నారు. ఈ మధ్య కాలంలో ఫుడ్ తినడం ఎక్కువ అయిపోయింది. హాబిట్స్ లలో సినిమాలు, ఫుడ్ రెండు చేరాయి.
చాలా రీసెర్చ్ చేసి చెబుతున్నాను. ఎర్లీ మార్నింగ్ కంటే కూడా నైట్ సమయంలో చదివితే చాలా ఎక్కువగా గుర్తు ఉంటుందని చెప్పాడు అక్షయ్ కుమార్. ఉదయం వేళలో చదివిన దాని కంటే.. రాత్రి సమయంలో చదివింది చాలా గుర్తుంటుందని సైన్స్ చెబుతుందని తెలిపాడు. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే.. రాత్రి అందరూ పడుకుంటారు.. డిస్ట్రబ్ చేసే వారు ఎవ్వరూ ఉండరు. చదువుకోవాలనుకొని జాబ్ కొట్టాలనుకునే వారు రాత్రి సమయంలో చదవడం బెటర్. ప్రజలను కంట్రోల్ చేసినప్పుడే లీడర్ అవుతాడని తెలిపాడు. ఇక చిరంజీవి నటించిన MBBS మూవీలో అక్షయ్ కుమార్ చిరంజీవి డాక్టర్ కావడానికి కీలక పాత్ర పోషించాడు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!