తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ నిర్మాతల్లో దిల్ రాజ్ కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన గమనాన్ని ప్రారంభించి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. అయితే దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు ఆటోమొబైల్ బిజినెస్ చేసే వారని ఆ బిజినెస్ లో కూడా చాలా లాభాలు పొందారని తెలుస్తోంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టి కెరియర్ మొదట్లో పెట్టిన డబ్బంతా పోగొట్టుకున్నారని సమాచారం.
Advertisement
also read;మంచు విష్ణు జిన్నా ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే ?
Advertisement
ఆ తర్వాత కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన తొలిప్రేమ సినిమాతో మొదటిసారి దిల్ రాజ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. ఈ సినిమా యొక్క నైజాం హక్కులను దిల్ రాజు 72 లక్షలకు కొన్నారట. ఇది అప్పట్లో పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా నైజాంలో ఏకంగా 2.80 లక్షల రూపాయలు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది అని చెప్పవచ్చు.
ఈ చిత్రం ఒక నైజాంలోనే 72 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే సంధ్య థియేటర్లో ఈ సినిమా 200 రోజులు ఆడి పెట్టిన పెట్టుబడి మొత్తం ఆ థియేటర్ ద్వారానే వచ్చిందని దిల్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక అప్పట్నుంచి దిల్ రాజు కెరియర్ మారిపోయిందని, పవన్ కళ్యాణ్ సినిమా దిల్ రాజుకు లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు.
also read;చిరంజీవి దగ్గర సౌందర్య నాపై ఏమని కంప్లైంట్ చేసిందంటే ?