Home » పచ్చి మిరపకాయ ఈ ప్రమాదక వ్యాధుల నుంచి కాపాడుతుందనే విషయం మీకు తెలుసా?

పచ్చి మిరపకాయ ఈ ప్రమాదక వ్యాధుల నుంచి కాపాడుతుందనే విషయం మీకు తెలుసా?

by Anji
Ad

సాధారణంగా మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు కొన్ని ప్రమాదకర వ్యాధుల నుంచి కాపాడతాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.  ఈ పచ్చి మిరపలో విటమిన్ A, C, B6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలో క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది.

Advertisement

పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి, ఎక్కువగా ఉంటుంది. కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయట. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. డయాబెటీస్ తో బాధపడుతున్న వారు స్పైసీ ఫుడ్ తినాలనుకుంటే పచ్చి మిరపకాయతో చేసిన ఫుడ్ తీసుకోవచ్చు. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఎ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. కేలరీలు పెరగడం ఆరోగ్య హేతువు.

ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా సులభంగా తినవచ్చు. బరువు తగ్గించడం తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరపకాయలు మెదడులోని ఎడార్ఫిన్ లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారట. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చలికాలంలో ఎర్ర మిరపకాయలకు బదులుగా పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు, దంతాలు, కళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చిమిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో చేర్చుకోండి ఫలితాలను పొందండి.

Advertisement

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading