Home » సింధూరం హీరోయిన్ సంఘవి గుర్తుందా? పెళ్లి తర్వాత ఎలా మారిపోయిందో చూశారా?

సింధూరం హీరోయిన్ సంఘవి గుర్తుందా? పెళ్లి తర్వాత ఎలా మారిపోయిందో చూశారా?

by Bunty
Ad

సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది నటీనటులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే ఎక్కువ కాలం రాణిస్తూ ఉంటారు. చాలామంది రెండు, మూడు సినిమాలు చేసి ఆ తర్వాత సరైన ఆఫర్స్ లేకపోవడంతో కనుమరుగు అవుతుంటారు. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా సరైన ఆఫర్లు లేకపోతే ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే.

Advertisement

అలా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో హీరోయిన్ సంఘవి ఒకరు. ‘హాయ్ రే హాయ్ జాంపండు రోయ్’ అంటూ సింధూరం సినిమాలో రవితేజను తన వెంట తిప్పుకుంది హీరోయిన్ సంఘవి. ఆ సినిమాలో ఆమె అందానికి, అమాయకత్వానికి రవితేజ ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుర్ర కారంతా ఫిదా అయిపోయారు. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 1993-24 మధ్యకాలంలో దక్షిణాది స్టార్ హీరోయిన్గా చలామణి అయింది.

Advertisement

స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. మొత్తం 15 ఏళ్ల సినిమా కెరియర్ లో 80కు పైగా చిత్రాల్లో నటించింది. తెలివితో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. కాగా, ఆలస్యంగా అంటే 38 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. 2016లో బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగితో కలిసి పెళ్లి పీటలు ఎక్కారు. ఆ తర్వాత 42 ఏళ్ల వయసులో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది.

READ ALSO : పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ తో లొల్లి పెట్టుకున్న బండ్ల గణేష్!

Visitors Are Also Reading