Home » పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ తో లొల్లి పెట్టుకున్న బండ్ల గణేష్!

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ తో లొల్లి పెట్టుకున్న బండ్ల గణేష్!

by Bunty

బండ్ల గణేష్ టాలీవుడ్లో బడా నిర్మాతగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ప్రతి రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక ఆయన స్పీచ్ లు అందులో ఉండే ప్రాసలు, పెంచే బుల్లెట్లు మాటల తూటాలకు అందరూ ఫిదా అవుతుంటారు. పవన్ కళ్యాణ్ భక్తుడు అంటూ గణేష్ ఇచ్చే స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు బండ్ల గణేష్. కాగా పవర్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలయ్య గబ్బర్ సింగ్ మూవీ రెమ్యూనరేషన్ గురించి అడిగారు. నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చాడని అడిగారు. దానికి పవన్ “నేను అనుకున్నంత ఇవ్వలేదు. తాను ఇవ్వాలనుకున్నంత ఇచ్చాడు” అని సమాధానం చెప్పారు. పవన్ కామెంట్స్ తో గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పవన్ మార్కెట్ ప్రకారం పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని వాదన మొదలైంది. అలాగే ఈ కారణంతోనే పవన్, బండ్ల గణేష్ తో మూవీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం తెరపైకి వచ్చింది.

ఈ క్రమంలో బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నువ్వు ఆయన్ని దైవంల భావిస్తావు, ప్రేమిస్తావు. ఆయనేమో ఒక పబ్లిక్ షోలో నీ పరువు తీసేసాడంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ట్యాగ్ చేసిన బండ్ల గణేష్ “నా విశ్వరూపం చూపిస్తా…” అని ఫైర్ ఎమోజిలు పోస్ట్ చేశారు. పవన్ చేసిన అవమానానికి ప్రతికారం తీర్చుకుంటా అన్నట్లు ఆయన కామెంట్ ఉంది. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. కత్తి మహేష్, శ్రీ రెడ్డి మాదిరి బండ్ల గణేష్ తయారయ్యాడని విమర్శిస్తున్నారు.

READ ALSO : సింగర్ వాణి జయరామ్ పోస్టుమార్టం పూర్తి…తలపై పెద్ద గాయం!

Visitors Are Also Reading