తెలుగు ప్రజలను ప్రతి గురువారం, శుక్రవారం కడుపుబ్బా నవ్వించే కార్యక్రమం జబర్దస్త్. అయితే ఈ షో ఎంతో మందికి అవకాశాలు ఇచ్చింది. చాలా మంచి ఆర్టిస్టులు ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఇందులో కొంత పేరు వచ్చిన తర్వాత తన సొంత యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకొని బాగానే సంపాదిస్తున్నారు. అలా జబర్దస్త్ ఆర్టిస్టులు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం..!
Advertisement
ఈ షోకు యాంకర్ గా వ్యవరించే అనసూయ భరద్వాజ్.. తన పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడిపిస్తూ.. నెలకు రూ. 2 నుండి 2.5 లక్షల వరకు పొందుతున్నట్లు సమాచారం. అలాగే జబర్దస్త్ టీం లీడర్ అయిన అధిరే అభి… ‘అమేజింగ్ అభి’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తూ నెలకు రూ. 50వే నుంచి లక్ష వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయన ఈ మధ్యే జబర్దస్త్ షోను వదిలేసారు.
Advertisement
ఇక జబర్దధ్ ద్వారా జనాలకు పరిచయమైన నటుడు నరేష్ తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని కలిగి ఉన్నాడు. కొంటె నరేష్ పేరుతో ఉన్న ఈ ఛానెల్ ద్వారా అతను దాదాపు నెలకు రూ. 40 వేలు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ‘రౌడీ రోహిణి’ పేరుతో ఓ ఛానెల్ ను నడిపిస్తున్న జబర్దస్త్ నటి రోహిణి నెలకు రూ.10వేలు సంపాదిస్తున్నట్లు సమాచారం.
ఇక రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 4తో బాగా పేరు తెచ్చుకున్నా అవినాష్ అంతకముందు జబర్దస్త్ షోతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతను ‘ముక్కు అవినాష్’ పేరుతో ఓ ఛానెల్‌ని నడిపిస్తూ ప్రతి నెలా రూ. 30 వేలు సంపాదిస్తున్నాడు. అలాగే జబరదస్త్ షోతో ఫేమ్ తెచ్చుకున్నా నటి వర్ష కూడా ‘ఇట్స్ వర్ష’ పేరుతో తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతోంది. ఆమెకు దీని ద్వారా నెలకు రూ.10వేలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
వైడ్స్ కూడా డీఆర్ఎస్ పెట్టాలి…!
సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా ఆడటం పై వార్నర్ కీలక వ్యాఖ్యలు…!