కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.. అంటే కన్నడ ప్రేక్షకులకు ఎంతో అభిమానం ఉంటుంది. ఇక ఈ హీరో సినిమా అప్పట్లో విడుదల అవుతుంది అంటే అభిమానుల ఆనందాలకు అవధులు ఉండేవి కావు. అలా కన్నడలో ఎంతో మంచి ఇమేజ్ సంపాదించిన ఉపేంద్ర తెలుగులో కూడా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో చేశారు. అలాంటి ఉపేంద్ర ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు .అలా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చేసిన విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే అప్పట్లో ఓ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించి ఉపేంద్ర పిచ్చివాడయ్యాడట.మరి ఆ హీరోయిన్ ఎవరు..ఎందుకు పిచ్చివాడయ్యాడు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపేంద్ర అప్పటి హీరోయిన్ అయిన ప్రేమ ని పిచ్చిగా ప్రేమించాడట. అంతే కాదు వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకున్నారు.అలాగే అప్పట్లో ప్రేమ ఉపేంద్ర కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చి ఇండస్ట్రీలో మంచి కెమిస్ట్రీ ఉన్న జోడీగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి వీరి మధ్య చాలా సంవత్సరాలు ప్రేమాయణం నడిచింది. కానీ చివరికి ప్రేమ ఉపేంద్ర ని పక్కన పెట్టింది. ఇక అది భరించలేని ఉపేంద్ర.. చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లి పిచ్చివాడయ్యాడని అప్పట్లో వార్తలు వినిపించాయి.
Advertisement
Advertisement
ఇక అదే సమయంలో ఈయన సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. అలా ఓవైపు ప్రేమించిన అమ్మాయి లేక మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన సినిమాలు కూడా హిట్ అవ్వకపోవడంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లి పిచ్చివాడైపోయారట. కానీ అదే సమయంలో హీరోయిన్ ప్రియాంక ఆయనను మళ్ళీ నటి ప్రేమ మాయ నుండి బయటపడేసింది.ఇక ప్రేమను మర్చిపోయి హీరోయిన్ ప్రియాంకని ఉపేంద్ర లవ్ చేశారు. అలా వీరిద్దరి మధ్య లవ్ పుట్టిన కొద్ది రోజులకే ఉపేంద్ర ప్రియాంకని పెళ్లాడారు. దానికి ప్రధాన కారణం మళ్లీ హీరోయిన్ ప్రేమ లాగే ప్రియాంక కూడా దూరం అవుతుంది అనే ఉద్దేశంతో ఆమెను తొందర పెళ్లి చేసుకున్నారట.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!