మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పాన్ ఇండియా హీరోగా మారారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపుతో ముందుకు వెళుతున్నారు. అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు ఈ మధ్యకాలంలోనే కూతురు పుట్టింది. ఆమె పేరు క్లింకారా అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్ క్లింకారా ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు.
Advertisement
అలాంటి రామ్ చరణ్ కోసం ఉపాసన ఒక సాక్రిఫైజ్ చేసిందట. దానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పెళ్లి జరిగిన తర్వాత ఎలాంటి ఆడపిల్ల అయినా సరే అత్తారింటికి రావాల్సిందే. ఆ సమయంలో వారు బాగా బాధపడతారు. ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లమే ఉపాసన కూడా పెళ్లి అయితే నేను అత్తారింటికి వెళ్ళను అని ఇక్కడే ఉండి మా మమ్మీ డాడీని చూసుకుంటానంటూ బలంగా చెప్పుకొచ్చేదట. కానీ రామ్ చరణ్ తో లవ్ లో పడ్డ తర్వాత కూడా ఆ విధంగానే చెప్పుకొచ్చిందట. దీంతో రామ్ చరణ్ అదంతా కామనే కదా అంటూ లైట్ తీసుకున్నారట.
Advertisement
అయితే ఉపాసన గురించి చరణ్ ఇంట్లో చెప్పిన మూమెంట్లో కూడా ఉపాసన నేను అత్తారింటికి రాను మా ఇంట్లోనే ఉంటాను అంటూ బాగా మొండి చేసిందట. కానీ వాళ్ళ అమ్మ శోభ ఆమెకు అర్థం అయ్యే భాషలో చెప్పి ఉపాసన ను కాంప్రమైజ్ చేయించి మరీ అత్తగారింటికి పంపిందట. ఈ విధంగా మొదటి నుంచి తాను అనుకున్నటువంటి విధానాన్ని మార్చుకొని చివరి సమయంలో తన తల్లిదండ్రులను వదిలి అత్తవారింట్లోకి అడుగుపెట్టిందని అంటున్నారు. ఈమె రామ్ చరణ్ కోసం పెద్ద సాక్రిఫైజ్ చేసిందని చరణ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.