మాస్ మహారాజ రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా నేడు విడుదలైనప్పటికీ కాస్త మిశ్రమ స్పందన లభించిందని చెప్పాలి.ఇండియన్ సినీ హిస్టరీలో దొంగగా గుర్తింపు పొందినటువంటి టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించారు. కానీ ఈ సినిమా కి ఈయన ఫస్ట్ ఛాయిస్ కాదని తెలుస్తోంది.
Advertisement
తొలుత ఈ సినిమా ఆఫర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు వెళ్లిందట. కానీ ఎందుకో అక్కడ సెట్ కాక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవిని ట్రై చేద్దామనుకున్నాడట డైరెక్టర్. వీరితో కాకపోతే ఈయన చివరికి రవితేజతో ఈ సినిమా చేశారు. మాస్ మహారాజ రవితేజ ఇప్పటి వరకు కేవలం టాలీవుడ్ లోనే సినిమాలు చేశారు. ఈ సినిమా ద్వారా ఈయన మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
ఇప్పటివరకు రవి తేజ నటించిన సినిమాలు హిందీలో కూడా విడుదల అయ్యాయి. ఇలా హిందీలో ఈయన సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన నుపురు సనన్ హీరోయిన్ గా నటించారు. అలాగే గాయత్రి భరద్వాజ హీరోయిన్ పాత్రలో నటించి సందడి చేశారు.ఇకపోతే ఈ సినిమాలో హేమలత అనే పాత్రలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం మిశ్రమ స్పందన దక్కించుకుంది.ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆ కారణంగానే సూర్యను జ్యోతిక పెళ్లి చేసుకుందా..? లవ్ స్టోరీని రివీల్ చేసిన జ్యోతిక..!