Home » గుంటూరు కారం మూవీకి బుక్ మై షో లో స్కామ్ అలా జరిగిందా ?

గుంటూరు కారం మూవీకి బుక్ మై షో లో స్కామ్ అలా జరిగిందా ?

by Anji
Published: Last Updated on

మహేష్‌ బాబు నటించిన గుంటూరు కారం మూవీకి ఫస్ట్ షో నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే రేటింగ్‌ విషయంలోనూ నెగటివ్‌ కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా బుక్‌ మై షోలో చాలా తక్కువ రేటింగ్‌ వచ్చింది. ఎలాంటి డిజాస్టర్‌ మూవీకైనా ఏడుకుపైగా రేటింగ్‌ వస్తుంటుంది. కానీ ఇందులో గుంటూరు కారం సినిమాకి  6.7 రేటింగ్‌ మాత్రమే వచ్చింది. దీంతో మహేష్‌ బాబు వంటి సూపర్‌ స్టార్‌ మూవీకి ఇంతటి తక్కువ రేటింగ్‌ రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

guntur-kaaram

 

బుక్‌ మై షోలో ఇంతటి తక్కువ రేటింగ్‌ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏదో కుట్ర జరిగిందని టీమ్‌ భావించింది. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసు వారికి గుంటూరు కారం నిర్మాతలు ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు దీనిపై విచారణ చేపట్టగా.. కొన్ని మూలాలు కనుగొన్నట్టు తెలుస్తుంది.  బెంగుళూరు, నర్సరావు పేట నుంచి ప్రధానంగా ఈ స్కామ్‌ జరిగిందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దాదాపు 15వేల అకౌంట్‌ యూజర్లు జీరో రేటింగ్‌ వేసినట్టు తెలుస్తుంది. వాళ్లు పనిగట్టుకుని ఈ పనిచేశారని, 15వేల యూజర్లు జీరో రేటింగ్‌ వేయడంతో ఓవరాల్‌గా రేటింగ్‌ పడిపోతుంది.

మహేష్‌ బాబు మూవీకి అదే జరిగిందని తెలుస్తుంది. మరి అందుకు కారకులు ఎవరనేది మాత్రం ఇంకా తెలియదు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. కొందరు దుండగులు కావాలనే కుట్ర చేసినట్టు అర్థమవుతుంది.  వారి ఉద్దేశం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.  సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది గుంటూరు కారం. బెనిఫిట్ షో నుంచే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ట్రోల్ కి గురైంది. మరోవైపు గుంటూరు కారం కంటే ముందే జనవరి 11న హనుమాన్ మూవీ ప్రీమియర్స్ వేయడంతో గుంటూరు కారం మూవీ కాస్త నెగిటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తోంది.  తొమ్మిది రోజుల్లో ఈ మూవీకి 216కోట్ల గ్రాస్‌, 105కోట్ల షేర్‌ వచ్చింది. ఇంకా ముప్పై కోట్ల షేర్‌ వస్తేగానీ ఈమూవీ బ్రేక్‌ ఈవెన్‌ కాదు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో వేచి చూడాలి మరీ.

 

Visitors Are Also Reading