Home » రామ్ చరణ్ ని ఆ రైటర్ అలా విమర్శించారా..? సక్సెస్ కి కారణం అతడేనా..!

రామ్ చరణ్ ని ఆ రైటర్ అలా విమర్శించారా..? సక్సెస్ కి కారణం అతడేనా..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే  భారీ సక్సెస్  సాధించాడు.  మధ్య మధ్యలో కొద్ది రోజుల పాటు ఆయనకు  హిట్ లేకుండా గడపాల్సి వచ్చింది.  అదే సమయం లో ఆయన యాక్టింగ్ మీద చాలా మంది చాలా విమర్శలు చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసిన కూడా ప్రతి ఒక్కరికి తన యాక్టింగ్ తోనే సమాధానం చెబుతూ వచ్చాడు. రంగస్థలం ముందు వరకు ఆయనకి యాక్టింగ్ రాదు అంటూ కొంతమంది రైటర్లు ఓపెన్ గా ఆయన మీద కామెంట్లు చేశారు. అలాగే అతన్ని దూషిస్తూ కూడా మాట్లాడారు. కానీ రంగ స్థలం తరువాత పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

టాలీవుడ్ లో ప్రముఖ రైటర్ రాంచరణ్ కు అస్సలు నటన రాదని.. ఆయన తండ్రి చిరంజీవి పేరు చెప్పుకొని సినిమాలు చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేయడం.. దానికి నాగబాబు లాంటి వారు కౌంటర్ కూడా ఇచ్చారు.  ఈ రైటర్ కొన్ని మనో విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కూడా రాశాడు. అవి చాలా పాపులర్ అయ్యాయి. ఆ సీనియర్ రైటర్ విమర్శలే రాంచరణ్ ను రాటు దేల్చాయి. నటనలో మెలకువలు నేర్చుకునేలా చేశాయి.  ఇక రామ్ చరణ్ ఎలాగైనా తన సత్తా చూపించుకోవాలనే ఉద్దేశ్యం తోనే చాలా కష్టపడి యాక్టింగ్ మెలకువలు నేర్చుకొని రంగస్థలం సినిమాతో తన యాక్టింగ్ ఏ లెవెల్ లో ఉంటుందో ప్రతి ఒక్క అభిమానికి తెలియజేశాడు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తో మరో మెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి. ఇలా తనకొచ్చిన విమర్శలని తొక్కుకుంటూ ఎదురుదాడి చేసి నటుడు గా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ ని చూసి చాలా నేర్చుకోవచ్చు అని అనుకునేలా తనని తాను మౌల్డ్ చేసుకున్నాడు. అందుకే ఎవరైనా విమర్శిస్తే స్వీకరించి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కానీ విమర్శిస్తున్నందుకు బాధపడకూడదు అనేది ఆయన లైఫ్ స్టైల్ ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదే విధంగా రామ్ చరణ్ తనను ఎవరైతే విమర్శించారో వాళ్ళందరికీ ఒక చెంప దెబ్బ కొట్టినంత పని చేశాడు తన నటనతోనే ఒక్కొక్కరికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. అందుకే ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం చాలా తక్కువ అంచనా వేయకూడదు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading