Home » Siddharth : పాన్ ఇండియా సినిమా గురించి సిద్దార్థ్ ఏమ‌న్నాడో తెలుసా..?

Siddharth : పాన్ ఇండియా సినిమా గురించి సిద్దార్థ్ ఏమ‌న్నాడో తెలుసా..?

by Anji
Ad

ప్ర‌స్తుత త‌రుణంలో చిత్ర ప‌రిశ్ర‌మ అంతా పాన్ ఇండియా లెవ‌ల్‌లో సినిమాల‌ను నిర్మించ‌డంలో నిమ‌గ్న‌మైపోయింది. ఇప్పుడు ఎక్క‌డ విన్నా బాహుబ‌లి, కేజీఎఫ్‌, పుష్ప‌, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల గురించే చ‌ర్చ కొన‌సాగుతుంది. పాన్ ఇండియా ప‌దంతో సౌత్ వ‌ర్సెస్ నార్త్ న‌టుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది. పాన్ ఇండియా అంశంపై మ‌నుసులో ఏది అనిపిస్తే అది నిర్మొహ‌మాటంగా ట్వీట్ చేసి అంద‌రి చేత విమ‌ర్శ‌లు అందుకునే హీరో సిద్ధార్థ్ తాజాగా స్పందించాడు.


ముఖ్యంగా పాన్ ఇండియా అనేది చాలా అగౌర‌వ‌క‌రమైన ప‌దం. పాన్ ఇండియా అనేది నాన్సెన్స్.. ఇక్క‌డ నిర్మించే అన్ని చిత్రాలు కూడా భార‌తీయ చిత్రాలే. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ వ‌చ్చిందా..? 20 ఏళ్ల క్రితం పాన్ ఇండియా సినిమా లేదా మ‌ణిర‌త్నం గారి రోజా సినిమా 1992లో తీశారు. ఈ చిత్రాన్ని భార‌త‌దేశం మొత్తం చూశారు. ఇటీవ‌లే నా స్నేహితులు కేజీఎఫ్ తీశారు. అది ఓ భార‌తీయ సినిమా అని గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఒక సినిమాను మీకు న‌చ్చిన భాష‌లో మీరు చూసే హ‌క్కు ఉంటుంది. పాన్ ఇండియా అని ఒక‌టే ర‌చ్చ చేస్తున్నారు. నాకు తెలిసి పాన్ ఇండియా అనే ప‌దాన్నే తీసేయాలి. దాని స్థానంలో భార‌తీయ సినిమా అని మాట్లాడాలి.

Advertisement

Advertisement


ప్ర‌తి సినిమాను భార‌తీయ సినిమా పిలిస్తే.. ఆ సినిమా ఏ భాష‌లో రూపొందిందో ఆ భాష‌తోనే పిల‌వాలి. క‌న్న‌డ సినిమా, తెలుగు సినిమా, త‌మిళం అని అనాలి. ముఖ్యంగా నేను త‌మిళం, తెలుగు సినిమాల్లో స్టార్డ‌మ్స్ సంపాదించి బాలీవుడ్‌కు వెళ్లినా న‌న్ను సౌత్ యాక్ట‌ర్ అనే అంటారు కానీ ఇండియ‌న్ యాక్ట‌ర్ అన‌రు. ఓ సినిమా అద్భుతంగా రావాలంటే ఎంతో మంది టెక్నిషియ‌న్లు కావాలి. వారికి భాషా భేదం ఉండ‌దు. అన్నింకంటే ముఖ్యం సినిమా విష‌యంలో కంటెంట్‌. ఆ కంటెంట్ బాగుంటే ఏ భాష‌లో ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అలాంటిదానికి ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి బిల్డ‌ప్ ఇవ్వాల్సిన అవ‌స‌రం అస‌లు లేదు అని చెప్పారు సిద్ధార్థ్‌. ఈ హీరో వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : 

ఆచార్య‌, అఖండ సినిమాల్లో ఉన్న కామ‌న్ పాయింట్స్ మీరు గుర్తించారా..?

ఆచార్య : సినిమా ఫ్లాప్ టాక్ రావడంతోనే కొరటాల శివ అలాంటి నిర్ణయం తీసుకున్నారా..!!

Visitors Are Also Reading