టాలీవుడ్ సీనియర్ హీరో పెద్ద కుమారుడు రమేష్‌బాబు బాల నటునిగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఆయన చదువును పూర్తి చేసి సామ్రాట్ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో రమేష్‌బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు పెద్ద కథ నడిచింది. కృష్ణ తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే సమయానికి అక్కినేని వారసుడు నాగార్జున, రామానాయుడు కుమారుడు వెంకటేష్, ఎన్టీఆర్ తమ్ముడిగా త్రివిక్రమరావు ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అవుతున్నారు.
Advertisement
అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణకు మధ్య అల్లూరి సీతారామరాజు నుంచి వివాదం ఏర్పడింది. అయితే సామ్రాట్ షూటింగ్ సమయంలో బాలకృష్ణ హీరోగా ఇదే టైటిల్‌తో మరొక సినిమా తెరకెక్కుతుంది. కృష్ణకూడా రమేష్ బాబు హీరోగా అదే టైటిల్‌తో సినిమా తీయడంతో ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమా చేస్తున్నాడని అప్పట్లో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. కృష్ణ ఈ సినిమా కోసం వివిధ ఇండస్ట్రీల నుంచి ఎంతో మంది అనుభవం ఉన్న నిపుణులను రంగంలోకి దించారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెడ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Advertisement
రమేష్‌బాబు, బాలకృష్ణ నటించిన రెండు సినిమాలకు ఒకే టైటిల్ కావడంతో టైటిల్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది. ఈ సినిమా టైటిల్ కోసం ఇరువర్గాలు ఏకంగా కోర్టునే ఆశ్రయించాయి. కోర్టు తీర్పుతో సామ్రాట్ టైటిల్‌ను రమేష్‌బాబు దక్కించుకున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాకు సాహస సామ్రాట్ టైటిల్ నామకరణం చేసారు. సామ్రాట్ సినిమా విజయం దక్కించుకోగా.. సాహస సామ్రాట్ అపజయంగా నిలిచింది. హీరోగా రమేష్‌బాబు మొదటిసినిమాతో విజయం దక్కించుకోగా ఈయనకు ఉన్న అలవాట్ల కారణంగా ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ కాలేకపోయినట్టు చెప్పుకోవచ్చు.