అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో అవార్డు రావడం.. రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ రాజధాని పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అవార్డుని అందుకుంటుంటే.. ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులు, ప్రేక్షకులు గర్వించారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Advertisement
అద్భుతమైన నటన ఆయన సొంతం. ఆయనకు అవార్డ్ రావాల్సిందే. ఇక ఈ అవార్డు రావడం గౌరవమనే చెప్పాలి. ఇప్పుడు పుష్ప గా అల్లు అర్జున్ అవార్డ్ తీసుకున్న నేపథ్యం లో మరో పుష్ప ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు పుష్ప 2 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్టు లో పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల ఇంకా చాలా సమయం ఉంది.అయినా కూడా ఏ ఒక్కరు ఆగడం లేదు.జాతీయ స్థాయి నుంచి అన్ని రాష్ట్రాల వరకు పుష్ప 2 రైట్స్ కోసం పైరవీలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా పుష్ప 2 రైట్స్ కోసం పైరవీలు చేస్తున్నారు అంటే బన్నీ స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన నటన తో పుష్ప2 మూవీతో కూడా కచ్చితంగా మైమరపించడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
Advertisement
అందుకే అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి ఏకంగా అయిదు వంద కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలం లో రాజమౌళి సినిమా లకు మాత్రమే ఆ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇప్పుడు జాతీయ అవార్డు కారణంగా అల్లు అర్జున్ సినిమాకు అవ్వబోతుంది. ఇక వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించడం తో పాటు అయిదు వందల కోట్లు ఇతర రైట్స్ ద్వారా రాబోతున్నాయి అంటున్నారు. అంటే నిర్మాతలకు తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల వరకు లాభం గా మిగిలే అవకాశాలుంటాయి అంటున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.