బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నమ్రత టాలీవుడ్ లో కూడా అంజి, వంశీ వంటి సినిమాలలో నటించింది. అయితే ఈమె నటించిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ప్లాఫ్ అయ్యాయి. కానీ ఈ హీరోయిన్ కి మాత్రం స్టార్ ఇమేజ్ ఉంది. ఎందుకంటే ఈమె విశ్వసుందరిగా కిరీటం గెలుచుకుంది. ఈ క్రేజ్ తోనే ఈమెకు ఎన్ని సినిమాలు ప్లాఫ్ అయినా కూడా వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఓ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందట నమ్రత. అది కూడా తన మామయ్య కృష్ణ వల్లేనట.
Advertisement
ఇక ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో కాదు మహేష్ బాబు హీరోగా చేసిన ఒక్కడు మూవీ. ఇక అసలు విషయం ఏమిటంటే..మహేష్ బాబు, భూమిక కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా 14 కోట్ల బడ్జెట్ పెడితే 30 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ అయింది. అంతేకాదు.. మహేష్ బాబు వన్ ఆఫ్ ద హిట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయితే ఈ సినిమా చేసే సమయం కంటే ముందే మహేష్ బాబు, నమ్రత ప్రేమలో ఉన్నారు.
Advertisement
ఈ కారణంతో నమ్రతని ఒక్కడు మూవీలో హీరోయిన్ గా పెట్టమని మహేష్ బాబు సజెస్ట్ చేశారట. అయితే డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఇందుకు ఓకే చెప్పినప్పటికీ ఈ విషయం తెలుసుకున్న కృష్ణ అవసరం లేదని చెప్పారట. ఎందుకంటే మహేష్ నమ్రతల ప్రేమ విషయం ఆయనకు తెలుసు. అంతే కాకుండా వీరి ప్రేమని ముందుగా కృష్ణ అంగీకరించలేదు. ఒకవేళ ఈ మూవీలో జంటగా చేస్తే వీరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుందనే ఉద్దేశంతో కృష్ణ ఈ సినిమాలో నమ్రతను వద్దని చెప్పారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!