Home » Sr. ఎన్టీఆర్ వల్లే నాగార్జునకు జాతీయ అవార్డు మిస్ అయిందా.. అసలు విషయం ఏంటంటే..?

Sr. ఎన్టీఆర్ వల్లే నాగార్జునకు జాతీయ అవార్డు మిస్ అయిందా.. అసలు విషయం ఏంటంటే..?

by Sravanthi
Ad

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే సౌత్ లోనూ నార్త్ లోనూ కాస్త చులకనగా ఉండేది. ఒకప్పుడు తెలుగు సినిమాలను తమిళ ఇండస్ట్రీలో ను మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో ను రీమేక్ చేసుకునేవారు. ఆ తర్వాత 90వ దశకంలో తెలుగు ఇండస్ట్రీ అంటే చిన్న చూపు చూసిన ప్రస్తుతం మాత్రం ఇండస్ట్రీ భారత దేశం దాటి ప్రపంచ దేశాల సినిమా ఇండస్ట్రీ ల చూపు పడేలా చేసింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని సినిమాలకు అవార్డులు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఎప్పుడైతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారో ఈ చిన్న చూపు మరింత పెరిగిపోయిందనే చర్చలు కూడా అప్పట్లో నడిచాయి.

Advertisement

ఎందుకంటే ఎన్టీఆర్ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండటంవల్ల తెలుగు ఇండస్ట్రీ ని ప్రభుత్వం చిన్న చూపు చూసేది. టిడిపి పార్టీ ని స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం తో ఎన్టీఆర్ పై తెలుగు ప్రజల అభిమానం చాలా పెరిగిపోయింది. ఈ తరుణంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలుగు ఇండస్ట్రీ పై మరింత కక్షపూరితంగా వ్యవహరించి సినిమాలకు రావాల్సిన అవార్డులు కూడా నిలిపివేశారట. ప్రాంతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో అవార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాటిని కూడా ఇవ్వకుండా రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు నిలిపివేశారని సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Advertisement

 

 

 

ఆ సమయంలోనే ఈయన దర్శకత్వంలో నాగార్జున రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సంకీర్తన సినిమాకు అవార్డు రావాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే 1987 జాతీయ అవార్డులకు జ్యూరీ మెంబర్ గా ఉన్న షావుకారు జానకి సైతం మన తెలుగు సినిమాల్లో ఒక మూవీకి జాతీయ అవార్డు రావాల్సి ఉందని గీతాకృష్ణ తెలిపారు. కేవలం ఎన్టీఆర్ పై ఉన్నటువంటి కోపంతో ఆ అవార్డులు అన్నింటినీ వారు నిలిపివేశారని.. దీనివల్ల సంకీర్తన మూవీకి అన్యాయం జరిగిందని గీతాకృష్ణ అన్నారు.

ALSO READ:

Visitors Are Also Reading