హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ అమలాపాల్ రెండో వివాహము గ్రాండ్ గా జరిగింది. బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్, జగత్ వివాహం నవంబర్ 5వ తేదీన కొచ్చిలో జరిగింది. కొన్ని రోజుల కిందట అమలాపాల్ పుట్టినరోజున ఆమెకు ప్రపోజ్ చేశారు. జగత్ ఈ ప్రపోజల్ కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జగత్ కు అమల ఓకే చెప్పారు. దీంతో వారి ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్ 5వ తేదీన కొచ్చిలో అమలాపాల్, జగత్ వివాహం జరిగింది. క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. జగత్ తో తన వివాహానికి సంబంధించిన ఫోటోలను అమలాపాల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే.. అమలాపాల్ మరియు తన మొదటి భర్త జగత్ విడాకులకు కారణం ఓ హీరో అంటూ ఆయన పేరు వినిపించింది. ఇక ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ధనుష్, అమలాపాల్ కాంబినేషన్లో రఘువరన్ బీటెక్, విఐపి2 సినిమాలు వచ్చాయి.
Advertisement
Advertisement
అయితే రఘువరన్ బీటెక్ సినిమా పెళ్లికి ముందే చేసినప్పటికీ, పెళ్లి తర్వాత వీఐపీ 2 సినిమా చేసింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనుకున్న అమలాపాల్ మళ్లీ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి భర్తను ఒప్పించి సినిమాల్లో చేసిందట. ఇక అదే సమయంలో ధనుష్ తో విఐపి2 సినిమాలో చేసే సమయంలో మంచి సాన్నిహిత్యం ఏర్పడి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కోలీవుడ్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!