ఐపీఎల్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బోణీ కొట్టింది. ఐపీఎల్ లో భాగంగా మొన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో వీరవిజృంభన చేసిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో మ్యాచ్ లో బ్యాటు జులిపించాడు.
Advertisement
31 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 57 పరుగులు చేసి వరుసగా రెండో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఋతురాజ్ లాగిపెట్టి కొట్టిన బంతి స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన కారుకు తగిలి సోట్టపడింది. అయితే అయితే ఈ ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
Advertisement
ఈ కాష్ లీవ్ లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏడవ బ్యాటర్ గా ధోని రికార్డులోకి ఎక్కాడు. ఐపీఎల్ 2023 లో భాగంగా ఈ మ్యాచ్ లో 12 పరుగులు చేసిన ధోని… ఈ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు. కాగా తలైవా వరుసగా రెండు సిక్సర్లు బాది ఈ రికార్డును సాధించాడు. అదేవిధంగా ఈ ఘనత సాధించిన ఐదవ భారత బ్యాటర్ గా ధోని నిలిచాడు. ఇందులో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా ధావన్ రెండవ స్థానంలో ఉన్నాడు.
read also : Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?