ఐపీఎల్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బోణీ కొట్టింది. ఐపీఎల్ లో భాగంగా మొన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో వీరవిజృంభన చేసిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో మ్యాచ్ లో బ్యాటు జులిపించాడు.
Advertisement
31 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 57 పరుగులు చేసి వరుసగా రెండో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఋతురాజ్ లాగిపెట్టి కొట్టిన బంతి స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన కారుకు తగిలి సోట్టపడింది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెత్త ప్రదర్శన కనపరిచారు. నో బాల్స్, వైడ్ బాల్స్ ఎక్కువగా వేశారు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు. ఇక దీనిపై మహేంద్ర సింగ్ ధోని చాలా సీరియస్ అయ్యారు.
Advertisement
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ… మా ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది. పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. నో బాల్స్ మరియు వైట్ బాల్స్ బాగా వేశారు. ఇది ఇలాగే కొనసాగితే వాళ్లు కొత్త నాయకుడి నేతృత్వంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్ అంటూ పేసర్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు ధోని. అంటే తాను కెప్టెన్సీకి రాజీనామా చేస్తానంటూ ఇన్ డైరెక్ట్ గా హెచ్చరించాడు ధోని.
READ ALSO : నా బాడీ, బరువుపై ట్రోల్స్ చేస్తున్నారు-హనీ రోజ్