తెలుగు నటుడు, నిర్మాత లక్ష్ చదలవాడ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు ధీర మూవీతో వచ్చేశాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2, 2024న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్ చదలవాడ సరసన నేహా పఠాన్, సోనియా బన్సాల్ కీలక పాత్రలు పోషించారు. మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్ మరియు మేకా రామకృష్ణ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కథ మరియు విశ్లేషణ :
డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే రణధీర్(లక్ష్) ఓ పాతిక లక్షల రూపాయలు వస్తాయని తెలియడంతో విశాఖపట్నం నుంచి కోమాలో ఉన్న పెషేంట్ ని హైదరాబాద్ తీసుకెళ్లేందుకు సిద్ధమవుతాడు. అంబులెన్స్ డ్రైవర్ గా వెళ్లిన ధీర్ కి ఆ అంబులెన్స్ లో డాక్టర్ గా వచ్చేది తన మాజీ ప్రేయస్ అమృత(నేహా పఠాన్) అని తెలుస్తుంది. లోపల ఉన్న పేషెంట్ ని చంపేందుకు కొన్ని గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉండటంతో చాకచక్యంగా ఆ పేషెంట్ ని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తాడు రణధీర్. హాస్పిటల్ లో జాయిన్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక తల్లి బిడ్డ తాను డ్రైవ్ చేస్తున్న వాహనంలో ఉన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అయితే రణధీర్ తీసుకెళ్లిన పేషెంట్ ఎవరు..? రణధీర్ ను తన బిడ్డను కాపాడమని ప్రాధేయపడిన మహిళ ఎవరు..? చిన్న పాప కోసం కొన్ని గ్యాంగ్ లు ఎందుకు వెంటపడుతున్నాయి అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని థియేటర్ లో వీక్షించాల్సిందే.
Advertisement
డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే ఒక వ్యక్తిగా ధీర క్యారెక్టర్ ను ఎస్టాబ్లిస్ చేశారు. అయితే ఎందుకు అలా చేస్తున్నాడనేది మాత్రం చివరి వరకు కూడా చెప్పలేకపోయాడు. హీరో క్యారెక్టర్ ని కాస్త భిన్నంగా తెరకెక్కించాడు దర్శకుడు. కొన్ని కామెడీ సీన్స్ తో అడపాదడపా కథనాన్ని స్లో చేసినట్లు అనిపించింది. సెకండాఫ్ యాక్షన్ సీక్వెన్స్ లతో నిండి ఉంది. లక్ష్ చదలవాడ తనదైన స్టైల్ లో నటించాడు. నేహా పఠాన్ డాక్టర్ పాత్రలో కనిపించింది. సోనియా బన్సాల్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఉన్నంతలో తన మార్క్ ను చాటుకునే ప్రయత్నం చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంటెన్సీని పెంచింది. వినయ్ రామస్వామి ఎడిటింగ్ డీసెంట్ ఉంది. నిర్మాణ విలువలు ఉన్నంలో ఉన్నాయి. ధీర మూవీ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్:
- కథ
- లక్ష్ చదలవాడ, నేహాపఠాన్ నటన
- బీజీఎం
మైనస్ పాయింట్స్ :
- కథనం స్లోగా సాగడం
- కామెడీ వర్కవుట్ కాకపోవడం
రేటింగ్: 2.75 /5