టాలీవుడ్లో థమన్, మిక్కీజే మేయర్ లాంటి స్వరకర్తలు పోటీ ఇస్తున్నా.. దేవీశ్రీప్రసాద్ మాత్రం తన పొజిషన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకు నిదర్శనమే ఇటీవల విడుదలై న అల్లుఅర్జున్-సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమానే. పుష్ప విజయం సాధించడంలో దేవీశ్రీ పాత్ర కీలకంగా ఉన్నదనే చెప్పవచ్చు.
Advertisement
ఇక పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప విజయంలో దేవీశ్రీ పాత్ర కూడా కీలకమనే చెప్పొచ్చు. ఈ చిత్రంలోని అన్ని పాటలు టాప్-100 యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్తలలో చోటు దక్కించుకున్నాయి. అదేవిధంగా బాలీవుడ్హ బిగ్గీస్ కన్ను సూపర్ టాలెంటెడ్ కంపోజర్పై పడింది. గతంలో దేవి కంపోజ్ చేసిన తెలుగు ట్యూన్లను బాలీవుడ్లో రీమెక్ చేసి హిట్నే కొట్టారు. అయితే డైరెక్టర్గా ఏ బాలీవుడ్ సినిమాకు దేవిశ్రీ సంగీతమును అందించలేదు. పుష్ప ప్రచారంలో ఇదే విషయము ప్రస్తావనకొచ్చింది. తను సినిమాకు సోలోగా పాటలనందించడానికి ఇష్టపడతానని చెప్పాడు దేవి.
Advertisement
ఇదిలా ఉండగా.. దేవీశ్రీ నిరీక్షణ ఫలించే రోజు దగ్గర పడినట్టే తెలుస్తోంది. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో డీఎస్పీ మీట్ అయ్యాడు. వీరి మీటింగ్లో త్వరలో టీ సిరిస్ నిర్మించే సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ మేకర్స్ పాటలకు, బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు వేర్వేరు సంగీత దర్శకులతో పని చేయించుకోవడం ఆనవాయితీగా చేసారు. ఈ విషయంపై దేవీశ్రీతో పాటు థమన్ కూడా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. టీసిరీస్ సినిమాకు దేవీశ్రీ పాటల వరకే పరిమితమవుతాడా..? లేక సంగీతాన్ని కూడా అందిస్తాడా చూడాలి.