కొత్త సంవత్సరంలో టీమిండియా మంచి శకునం ఎదురయింది. శ్రీలంకతో మూడు టీ 20 ల సిరీస్ లో టీం ఇండియాకు శుభారంభం చేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టి20 జట్టు మంగళవారం తొలి టీ 20 లో రెండు పరుగుల తేడాతో లంకను ఓడించింది. అయితే, కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను మంచి బ్యాటింగ్ తో ఆదుకున్న దీపక్ హుడా పై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ముంబైలోని వాంకడే క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో దీపక్ హుడా మంచి ప్రదర్శన కనబరిచారు. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని, 41 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడి శ్రీలంక ముందు 163 పరుగుల టార్గెట్ ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అతను చేసిన ఒక పని మాత్రం క్రికెట్ అభిమానులకు తీవ్ర కోపం తెప్పించింది.
Advertisement
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ పై అసభ్య పదజాలంతో నోరు పారేసుకున్నాడు. అసలు ఏం జరిగింది? ఏంటి అంటే, ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతిని అంపైర్ వైడ్ ఇవ్వలేదని పచ్చి బూతులు తిట్టాడు. నిజానికి ఆ బాల్ ఆఫ్ సైడ్ వెళ్తుండగా, దీపక్ సైతం దాన్ని వెంటాడి, కాస్త ఆఫ్ సైడ్ కు వచ్చి ఆడాడు. దాంతో అంపైర్ దాన్ని వైడ్ గా ప్రకటించలేదు. దీంతో, ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ ను బూతులు తిట్టాడు. తర్వాత బంతికి సింగిల్ తీసి, అంపైర్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఇలా అంపైర్ నిర్ణయంతో అసహనానికి గురైన దీపక్ హుడా కాస్త హద్దు మీరు ప్రవర్తించాడు. దీంతో మంచి ఇన్నింగ్స్ ఆడినా, సొంత దేశపు క్రికెట్ అభిమానులతో తిట్లు తిన్నాడు.
Just tell me what he saying 🤣 to UMPIRE ?!
M****ke l***de ?!#DeepakHooda #INDvSL #HardikPandya #T20I pic.twitter.com/Fyt4Ok8FKi— Cricket Insider (@theDcricket) January 4, 2023
ఇవి కూడా చదవండి : Varisu : ఏదిచ్చినా ట్రిపుల్గా తిరిగి ఇచ్చేస్తాడు.. ‘వారసుడు’ ట్రైలర్