వరుసగా పెరుగుతూ పోయిన క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో క్రూడ్ అయిల్ ధర పరుగులు పెట్టింది పెడుతోంది. మరల ఇప్పుడు ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. రెండు వారాల కనిష్టానికి చేరుకున్నది. క్రూడ్ ఆయిల్ ధర ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు కొలిక్కి వచ్చే సూచనలు వినిపిస్తున్నాయి. మరొకవైపు రష్యాలో కరోనా కేసులు పెరగడంతో ఆ ప్రభావం ముడి చమురు ధరలపై పడింది.
Advertisement
Advertisement
బ్రెంట్ క్రూడ్ ధర 4 డాలర్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 102 డాలర్ల 70 సెంట్లుగా ఉంది. ఈనెలలో ఒకానొక దశలో బ్రెంట్ క్రూడ్ ధర 130 డాలర్ల వరకు వెళ్లింది. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ డబ్ల్యూటీఐ క్రూడ్ ప్యూచర్స్ విలువ వంద డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం డబ్లయూటీఐ బ్యారెల్ 98 డాలర్ల 71 సెంట్‌లుగా ఉన్నది.
Also Read : భర్త పరాయి స్త్రీ పై మోజు పడడానికి 3 ప్రధాన కారణాలు అవేనట..!