క్రికెట్ లో కొత్త రూల్స్ రానున్నాయి. అవి ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి అమలు కానున్నాయయి. మన్కడింగ్ అనేది క్రీడాస్పూర్తికి విరుద్ధమని, దానిని క్రికెట్ రూల్స్ నుంచి తీసేస్తున్నట్టు మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్ వెల్లడించింది. దీంతో పాటు కొన్ని కొత్త నియమాలను ఎంసీసీ ప్రకటించింది.
Advertisement
మన్కడింగ్ అంటే ఏమిటి..?
బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే సదరు బౌలర్ అతడిని ఔట్ చేసే అవకాశాన్ని మన్కడింగ్ అంటారు. 1948లో తొలిసారిగా భారత క్రికెటర్ వినూ మన్కడ్ ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ బ్రౌన్‌ను ఇలా ఔట్ చేశాడు. దానికి ఆస్ట్రేలియా మీడియా మన్కడింగ్ అనే పేరు పెట్టింది. నాన్ స్ట్రైక్ ఎండ్ ఉండే బ్యాటర్ అయినా పరుగు కోసం సిద్ధంగా ఉంటారు. అందుకు కొన్ని సార్లు క్రీజు దాటే అవకాశముంటుంది. ఇకపై బౌలర్ మన్కడింగ్‌ను రనౌట్ కింద పరిగణిస్తామని ఎంసీ సీ తెలిపింది.
వైడ్ బాల్ మాదిరిగానే..
ఇక నుంచి స్ల్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నిలుచున్న స్థానం నుంచి బంతి కొద్ది దూరంలో వెళ్లినా.. దానిని వైడ్‌గా పరిగణించాలనే కొత్త రూల్‌ను ఎంసీసీ అమలులోకి తేనుంది.
క్యాచ్ ఔట్ లో చిన్న మార్పు
మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్యాచ్ ఔట్‌కు సంబంధించి ఎంసీసీ చిన్న సవరణ చేసింది. ఫీల్డర్ క్యాచ్ పట్టడానికి ముందు ఇద్దరు బ్యాటర్లు క్రీజు దాటితే ఇకపై క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపునకు వెళ్లాలి.
సలైవా ఉపయోగించవద్దు..
బంతిని షైన్ చేసేందుకు బౌలర్లు సలైవా (ఉమ్మి) ఉపయోగించకూడదని కరోనా సమయంలో ఎంసీసీ తెలిపింది. ఇప్పుడు సలైవాను పూర్తిగా ఉపయోగించవద్దని ఎంసీసీ పేర్కొంది. సలైవా బాల్‌కు అప్లై చేస్తే టాంపరింగ్‌కు పాల్పడే అవకాశమున్నందున నిషేదించామని తెలిపింది.
Advertisement
రీప్లేస్ చేస్తే..
ఏదైనా సందర్భంలో జట్టులో ఒక ఆటగాడికి బదులు మరొక ఆటగాడిని రిప్లేస్ చేస్తే ముందు ఉన్న ఆటగాడికి సంబంధించిన ఆంక్షలు, జరిమానాలు అన్ని కొత్తగా వచ్చిన ఆటగాడికే చెందుతాయని ఎంసీసీ పేర్కొన్నది.
ఇక అది డెడ్ బాలే..
కొన్ని సందర్భాల్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్‌లోకి జంతువులు గానీ, మనుషులు గానీ వస్తే.. అప్పుడు బౌలర్ వేసిన బంతిని డెడ్ బాల్ గా పరిగణించాలని ఎంసీసీ తెలిపింది. కట్ స్ట్రిప్ దాటిన బంతిని బ్యాటర్ టచ్ చేసే విషయంలోనూ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.
క్రికెట్‌లో బౌన్సర్లను నిషేదించాలంటూ కొద్ది కాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఎంసీసీ( మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్) స్పందించింది. షార్ట్ పిచ్ బౌలింగ్‌ను నిషేదించాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఫీల్డ్‌లో షార్ట్ పిచ్డ్ బౌలింగ్ అనేది క్రీడలో భాగం అని, దానిని మార్చడం ద్వారా ఆట విధానం మారుతుందని ఎంసీసీకి చెందిన జామీ కాక్స్ పేర్కొన్నారు. ఐసీసీ నిబంధన ప్రకారం.. ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్లకు మాత్రమే అనుమతి ఉంది.
ముఖ్యంగా బౌన్సర్ల వేగం ధాటికి బంతి హెల్మెట్‌కు బలంగా తగిలి చాలా మంది క్రికెటర్లు కంకషన్ బారిన పడ్డారు. అప్పటి నుండి బౌన్సర్లను నిషేదించడం ఒక్కటే మార్గమని చాలా మంది నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ తరుణంలో ప్రమాదకర బౌన్సర్ కారణంగా ఆసీస్ మాజీ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతి చెందారు. ఆ తరువాత బౌన్సర్లపై నిషేదం విధించాలన్న వాదన మరింత ఎక్కువ అయింది. ఆ ఆటగాడి అకాల మరణంతో హెల్మెట్ డిజైన్‌లో ఎంసీసీ మార్పులు చేసింది.
Also Read : కత్తి మహేశ్ ను గుర్తు చేసుకుని శ్రీరెడ్డి ఎమోషనల్…వీడియో వైరల్..!