ఈ ఏడాది విడుదలైన రెండు తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మన సినిమా రుచిని చూపించాయి. అందులో మొదటిది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ అయితే మరొకటి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా. సుకుమార్ మొదటి సారి పుష్ప సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమాను కేవలం తెలుగులోనే విడుదల చేశారు. కానీ పుష్ప సినిమాను ముందే చూసిన రాజమౌళి పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని సూచించారు.
Advertisement
అలా ఈ చిత్రాన్ని సుకుమార్ అన్ని భాషల్లో విడుదల చేశాడు. ఈ సినిమా గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కగా అసలు నార్త్ వాళ్లకు కనెక్ట్ అవుతుందా లేదా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ సౌత్ లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రాగా నార్త్ లో మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. స్టార్ క్రికెటర్ లు సైతం ఈ సినిమా డైలాగులు కొట్టడం…స్టేడియంలో తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మ్యానరిజం ను చేసి చూపించడం తెలిసిందే. దాంతో ఈ సినిమా క్రేజ్ పీక్స్ లోకి వెళ్లిపోయింది. ఇక ఈ సినిమాను థియేటర్ లో చాలా మంది ఎంజాయ్ చేశారు.
Advertisement
కరోనా తరవాత వచ్చిన సినిమాల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు కూడా ఆర్ఆర్ఆర్ మరియు పుష్ప సినిమాలే. సుకుమార్ ను అందరూ క్రేజీ డైరెక్టర్ అని పిలుస్తారు. దానికి కారణం సుకుమార్ సినిమాల్లోని సీన్లలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. అలా పుష్ఫ సినిమాలో కూడా చాలా సీన్లు ఉంటాయి. పుష్ఫ లో సునీల్ మంగళం శ్రీను పాత్రలో నటించాడు. కాగా పుష్ఫరాజ్ మొదటి సారి మంగళం శ్రీనును కలిసినప్పుడు ఇద్దరి ఈగోలు ఏ రేంజ్ లో ఉంటాయో మాటల్లో కాకుండా చేతల్లో చూపించాడు.
బన్నీ సిగరెట్ వెలుగించుకుంటాడు. అప్పుడే మంగళం శ్రీను కూడా నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు. అయితే పుష్ఫరాజ్ ఎవరిముందు తల వంచడు. దాంతో మంగళం శ్రీను సిగరెట్ ను తన వద్ద ఉన్న అగ్గిపుల్లతో అంటించేటప్పుడు దాన్ని కాస్త కిందకి పెడతాడు. కానీ మంగళం శ్రీను కూడా తల వంచకుండా నిప్పు తన సిగరెట్ దగ్గరకు వచ్చి అది వెలిగే వరకూ చూస్తూనే ఉంటారు. ఈ సీన్ ఓటీటీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది.
ALSO READ: “ఖుషి” షూటింగ్ లో ప్రమాదం….ఆస్పత్రిలో చేరిన సమంత, విజయ్ దేవరకొండ…!