బిగ్ బాస్ టీవీ షోకు తెలుగులో ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు ఆరో సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ సారి 24 గంటల పాటు బిగ్ బాస్ ను ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఎంతో సక్సెస్ అయిన బిగ్ బాస్ ను ఇష్టపడే వారితో పాటు కొంతమంది ద్వేషించే వారు కూడా ఉన్నారు. బిగ్ బాస్ వల్ల మన కల్చర్ పాడైపోతుందని పలువురు సామాజిక రాజకీయ నాయకులు కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అలా కామెంట్ చేసిన వారిలో సిపిఐ నేత నారాయణ కూడా ఒకరు. తాజాగా సిపిఐ నారాయణ ఓ ఇంటర్వ్యూ బిగ్ బాస్ పై నాగార్జున మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ అమ్మాయి తో డేటింగ్ చేస్తావు…. ఏ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటావు… ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అంటూ నాగార్జున ప్రశ్నలు వేస్తారు. అనేదే బిగ్ బాస్ షోనా…. నాగార్జున ఇంట్లో కూడా ఆడ వాళ్ళు ఉన్నారు కదా అంటూ కామెంట్ చేశాడు.
Advertisement
Advertisement
ALSO READ : బాలయ్య అఖండపై శ్రీరెడ్డి రివ్య్వూ..ఎవడికైనా పూనకాలే…!
తనకు నాగార్జున అంటే కోపం కాదని అసహ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు… చినిగిపోయిన చెప్పులు ఉండాలి గడ్డం పెంచాలి, అప్పుడు వాడు నిజమైన కమ్యూనిస్టు అంటారరని కానీ అది భ్రమ అని నారాయణ వ్యాఖ్యానించారు.
చిన జీయర్ మొదలుకొని రకరకాల వాళ్ళు కూడా మాకు కమ్యూనిస్టు భావాలు ఉన్నాయని చెప్పేవారిని అన్నారు. ఇక ఏపీలో రాక్షస పాలన సాగుతోందని అన్నారు. సీఎం జగన్ వయసు తక్కువ అని.. అనుభవం తక్కువ అని కామెంట్ చేశారు. కేసీఆర్ తో పొత్తు గురించి మాట్లాడుతూ కేసీఆర్ సంగతి తనకు తెలుసు అని తన పార్టీ వాళ్లకు తెలియాలని అన్నారు.