Home » బాల‌య్య అఖండ‌పై శ్రీరెడ్డి రివ్య్వూ..ఎవ‌డికైనా పూన‌కాలే…!

బాల‌య్య అఖండ‌పై శ్రీరెడ్డి రివ్య్వూ..ఎవ‌డికైనా పూన‌కాలే…!

by AJAY
Ad

వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి ప్ర‌స్తుతం ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ను పెట్టుకుని అందులో వీడియోలు చేస్తోంది. ఫిట్నెస్ వీడియోలు వంట‌ల‌తో పాటూ రాజ‌కీయాలు సినిమాలు ఇలా దేన్ని వ‌దిలిపెట్ట‌కుండా అన్నింటిపై శ్రీరెడ్డి వీడియోలు చేస్తోంది. కాగా తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌పై ప్ర‌త్యేకంగా ఓ వీడియో చేసి న‌టి శ్రీరెడ్డి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురింపించింది. బాల‌య్య అఖండ సినిమాపై మ‌రియు అన్ స్టాప‌బుల్ టాక్ షో పై శ్రీరెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు. బాల‌య్య పుట్టు పూర్వోత్త‌రాల‌ను చెబుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను చెప్పుకొచ్చింది.

Srireddy

Srireddy

బాల‌య్య మూవీ చూస్తే ఎవ‌డికైనా పూన‌కాలే రీజన్ తెలుసుకోవాల‌నుందా అంటూ వీడియోల‌కు టైటిల్ ను పెట్టింది. బాల‌య్య అఖండ సినిమా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేసింది. సినిమాలో బాల‌య్య చెప్పిన డైలాగులు సూప‌ర్ గా ఉన్నాయ‌ని అలాంటి డైలాగులు రాయ‌డం ఒక ఎత్తు అయితే అలాంటి డైలాగులు చెప్ప‌డం ఒక్క బాల‌య్య‌కే సాధ్యం అంటూ కామెంట్లు చేసింది. డైలాగుల‌ను అందంగా, భ‌యంక‌రంగా చెప్పాలంటూ ఒక్క బాల‌య్య‌కు మాత్రమే వ‌చ్చ‌ని తెలిపింది.

Advertisement

Advertisement

ALSO READ : ఆ స్టార్ హీరో వ‌ల్ల పెళ్లికి దూర‌మైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

Balayya

Balayya akhanda movie review

అంద‌రినీ చిరంజీవి, మ‌హేష్ బాబు ఇలా పిలుస్తామ‌ని కానీ బాల‌య్య‌ను ఒక్క‌డినే ముద్దుగా బాల‌య్య బాబు అని పిలుస్తామ‌ని శ్రీరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ కు ముద్దుల కొడుకు బాల‌య్య ఇప్ప‌టికీ ఆయ‌న‌ను త‌లుచుకుంటూ ఉంటారు. నాన్న‌గారి గారాల ప‌ట్టి బాల‌య్య అంటూ కామెంట్ చేసింది. బాల‌య్య హిందూపురం ఎమ్మెల్యేగా స‌క్సెస్ ఫుల్ రాజ‌కీయ‌నాయకుడిగా కొన‌సాగుతున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు.

Balayya

Balayya

క‌రోనా సీజ‌న్ లో డ్రై సీజ‌న్ అఖండ ఘ‌న విజ‌యం సాధించింద‌ని ఆ క్రెడిట్ మొత్తం కేవ‌లం బాల‌య్య బాబుకే ద‌క్కుతుంద‌ని చెప్పింది. 50 రోజుల్లో రెండు వంద‌ల క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టి ఇప్పుడు ఓటీటీలోనూ రేటింగ్ లో దూసుకుపోతుందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. అన్ స్టాప‌బుల్ రికార్డుల‌ను కూడా ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేసింది.

Visitors Are Also Reading