సాధారణంగా మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం ఎక్కువ అయింది. జొన్నలు ఆహారంగా తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు తగ్గి, మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. జొన్నల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ తో పాటు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ మంది జొన్న రొట్టెలు తింటారు. అయితే ఈ రొట్టెలతో పాటు జొన్నలతో అంబలిని చేసుకుని తాగవచ్చు. జొన్న అంబలిని తాగితే రుచితో పాటు మంచి ఆరోగ్యం సొంతం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జొన్న అంబలిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్న అంబలి రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ అంబలిని తాగితే మన శరీరానికి కలిగే మేలు జరుగుతుందో ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ఒక గిన్నెలో కొద్దిగా జొన్న పిండి, ఉప్పుని వేసి దానిలో మూడు గ్లాసుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి చిన్న మంటపై కలుపుతూ ఉడికించాలి. ఈ అంబలిని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత దీనిని ఒక గ్లాస్ లోకి తీసుకొని, అందులో నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపితే ఎంతో రుచిగా ఉండే జొన్న అంబలి రెడీ తయారవుతుంది. ఈ విధంగా జొన్న పిండితో అంబలిని చేసి తాగితే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్ని లభించి నీరసం, బలహీనత, రక్తహీనత, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ అంబలిని తాగడం వల్ల జీర్ణశక్తి పెరిగి, ఎముకలు దృఢంగా ఉంటాయి.
ఈ అంబలిని తాగడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ అంబలిని శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగి, గుండె ఆరోగ్యంగా పనిచేస్తోంది. అంతేకాదు.. ఈ అంబలిని తాగితే శరీరంలో వేడి తగ్గి, కండరాలు దృఢంగా, షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వ్యాయామాలు చేసే వారు ఈ అంబలిని ప్రతిరోజు తాగితే మంచి ఫలితం వస్తుంది. ఈ విధంగా జొన్నలతో చేసిన అంబలి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పిల్లలు, పెద్దవారు ఎవరైనా తాగవచ్చు. అయితే, జొన్నలతో రొట్టెలే కాకుండా అంబలిని తాగితే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!