సర్వసాధారణంగా మెగాస్టార్ చిరంజీవి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. తనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ కాముగానే ఉంటారు. చిరంజీవితో జూనియర్ ఎన్టీఆర్‌కు కొంతకాలం కిందట దూరం ఏర్పడింది. ఒకానొక సందర్భంలో లైవ్‌లో మాట్లాడుతూ.. చిరంజీవి ప్రస్థావన వచ్చినప్పుడు ఆయన ఎవరో తనకు తెలియదు అని చెప్పడం అప్పట్లో ఇండస్ట్రీలో అది ఒక హాట్ టాపిక్ అయింది.
Advertisement
పరిస్థితులు మారి చిరంజీవి మనస్తత్వం ఎన్టీఆర్ తెలుసుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. ఎన్టీఆర్, చిరు తనయుడు రామ్‌చరణ్‌తో ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా నటించారు. ఇరువురు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. కరోనా, ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది.
Advertisement
కెరీర్ ప్రారంభంలో చిరంజీవి అంటే ఎన్టీఆర్‌కు ఎందుకు పడలేదనే ప్రశ్నకు సరైన సమాధానం ఎవరూ కూడా చెప్పేవారు కాదు. బాక్సాఫీస్ వసూళ్లు, ఇమేజ్ వల్ల వచ్చి ఈగో క్లాషెష్ అని మాత్రం పలువురు పేర్కొనేవారు. అయితే అప్పట్లో ఒక నెంబర్ వన్ హీరో గురించి అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చిన తారక్ తనకు తెలియదు అని పేర్కొనడం మెగాఫ్యాన్స్కు ఇబ్బంది కలిగించిన విషయమే.
మెగా-నందమూరి పాత గొడవలకు కారణం ఏమిటి..? అనే దానిపై సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూ వివరించారు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో ఓ మేనేజర్ ఉండేవాడట. మేనేజర్ చిరంజీవి గురించి ఎన్టీఆర్ కు లేనిపోనివి చెప్పేవాడట. చిరంజీవిని ఎన్టీఆర్ దగ్గర చెడు చిత్రీకరించేవాడట. మేనేజర్ గురించి అసలు నిజం తెలియడంతో ఎన్టీఆర్ ఆయనను తొలగించారు అని, ఆ తరువాత చిరు ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎన్టీఆర్‌కు సఖ్యత పెరిగినట్టు నిర్మాత గిరి చెప్పారు.