అనంతపురం జిల్లాలో ని ఓ ప్రముఖ శైవ క్షేత్రంలోని శివాలయంలో నాగుపాము హల్ చల్ సృష్టించినది. అర్థరాత్రి 12 గంటల సమయంలో అది ఒకూరి చివరన ఉన్న శివాలయం కనిపించింది. ఓ వివామ వేడుకకు సిద్ధం అవుతున్న సమయంలో ఈఘటన చోటు చేసుకుంది. చివరిలో ఆలయం తలుపులు మూయాలని చూస్తే శివలింగం వెనుక భారీ నాగుపాము బుసలు కొడుతూ.. పడగ విప్పింది. ఇది చూపి పెళ్లి బృందం ఆశ్యర్యపోయారు.
Advertisement
Advertisement
అసలు అర్థరాత్రి శివలింగం చెంతన పాము.. అందులో నాగుపాము చూసి ప్రజలు భయాందోళన చెందారు. వివరాల్లోకి వెళ్లితే..అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బైర సముద్రంలో రుద్ర లింగేశ్వర ఆలయంలో జరిగింది. ఆదివారం రాత్రి పూజా కార్యక్రమాలకు వెళ్లిన కొంతమంది భక్తులకు శివలింగం పక్కనే నాగుపాము కనిపించడంతో భయాందోళన గురయ్యారు. గంటకు పైగా గర్భగుడిలోని నాగుపాము ఒకే చోట ఉంది. పడగ విప్పి బుసలు కొట్టింది.
అప్పుడు భక్తులందరూ ఓం నమః శివాయ అంటూ పూజలు చేశారు. ఇది సాక్షాత్తు శివుని మహిమ అని భావించారు. యువకులు నాగుపామును బయటికి పంపించారు. అర్థరాత్రి శివలింగం చెంతన పాము ఉన్న ఘటనపై ప్రజలందరూ చర్చించుకోవడం ప్రారంభించారు.