మన నిత్య జీవితంలో సినిమా అనేది ఒక భాగమై పోయింది. విడుదలైన సినిమా గురించో.. రాబోయే సినిమా గురించో తమ అభిమాన తారల గురించో, ఎవరి గురించో, లేక సినిమా గురించో, సినిమా పాటల గురించో, ఫైట్ల గురించో, కలెక్షన్‌ల గురించో ఏదో ఒకదానిపై తరుచూ ఎక్కడ ఒక చోట చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. కాకపోతే కలెక్షన్‌లు, సెంటర్ల విషయంలో చాలా డౌట్లు ఉంటాయి.
Advertisement
సినిమా ప్రొడ్యూసర్ తెలుసు, దర్శకుడు తెలుసు, హీరో, హీరోయిన్‌లతో పాటు ఇతర నటీనటులు అందరికీ తెలిసి ఉంటుంది. కానీ సినిమా డిస్ట్రిబ్యూటర్ గురించి మాత్రం ఎక్కువగా ఎవరికీ అంతగా తెలియదు. వారు చేసే పనులు ఏమిటి ఏమి చేస్తారనేవి అసలు తెలియవు. సినిమా డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరూ అంటే.. మనం ఒక ఫ్యాషన్‌తో ఒక సినిమా చేసిన తరువాత ఒక నిర్మాత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా పూర్తయిన తరువాత సినిమా వ్యాపారం ప్రారంభమవుతుంది.
Advertisement
అంటే మనం పెట్టిన పెట్టుబడికి వ్యాపారం చేసి దాని మీద లాభాలు కావచ్చు. నష్టాలు కావచ్చు. ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పద్దతి ప్రకారం సినిమా సిద్దమైన తరువాత డిస్ట్రిబ్యూటర్లు ఏరియాల వారిగా సినిమాను కొంటారు. మన సినిమాను ఎవ్వరు అయితే కొంటారో వారినే బయర్లు లేదా డిస్ట్రిబ్యూటర్లు అని పిలుస్తుంటారు. ఈ బయర్లు ఏమి చేస్తారంటే.. డిస్ట్రిబ్యూటర్‌గా ఫిలించాంబర్‌లలో డిస్ట్రిబ్యూటర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. ఒక సినిమా సిద్ధమైనప్పుడు దాని గురించి ఎంక్వయిరీ చేసి.. టీజర్, ట్రైలర్ ఎలా ఉందని ఎంక్వయిరీ చేసి పాత కాలంలో అయితే ముందుగానే అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేవారు.
కానీ ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అనే మాటనే పోయింది. కొత్త డిస్ట్రిబ్యూటర్లను మన సినిమాలను మనమే కొనుక్కుంటూ.. మన సినిమాలను మనమే బ్రతికించుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు ప్రస్తుతం. ముఖ్యంగా తెలంగాణలోని డిస్ట్రిబ్యూటర్లను నైజాం అని, రాయల సీమ డిస్ట్రిబ్యూటర్ లను సీడెడ్ అని, ఉత్తరాంద్ర జిల్లాలను యూఏ, మిగిలిన ఏరియాను ఆంధ్ర, నార్త్ ఇండియాను రెస్ట్ ఆఫ్ ఇండియా, విదేశాల్లో ఓవర్సిస్ అని అంటుంటారు. నిర్మాత సినిమా రైట్స్‌ను అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్ కొంటాడు. కొన్ని ఏరియాలకు ఒక్కడే డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. మరికొన్ని ఏరియాలకు గ్రూపు ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్‌ను బట్టి ఉంటుంది.