సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఏ పనిలో అయినా ఒకరి ఎదుగుదలను జీర్ణించుకోలేని వారుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా చిరంజీవి అంటే పడని వారు ఎవరో తెలియదు కానీ ఆయనపై విష ప్రయోగం చేశారు. అయితే ఈ ప్రయోగం జరిగి దాదాపుగా 35 సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ విషయం ఇప్పటికే కొంత మందికి తెలిసి ఉండొచ్చు. కానీ దీనిపై తాజాగా మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో మళ్లీ ప్రస్తావించారు. దీంతో ఈ తతంగమంతా మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి మరణ మృదంగం అనే సినిమా షూటింగ్ టైంలో ఈ ఘటన జరిగిందని, ఎవరు చేశారు అన్నది క్లియర్ గా నాకు తెలియదు కానీ, ఆయన ఎదుగుదలను చూసి ఆయనపై కొందరు విష ప్రయోగం చేసి ఉండొచ్చని అన్నారు.
Advertisement
మరి చిరంజీవి పై విష ప్రయోగం ఎలా చేశారు? ఎవరు చేశారు? అనేది చూద్దాం.. ఖైదీ మూవీ తర్వాత చిరంజీవి క్రేజ్ మరింత పెరిగిపోయింది. మాస్ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సందర్భంలోనే చిరంజీవి షూటింగ్ అంటే చాలా మంది అభిమానులు వచ్చేవారట. వీరిలో చాలామంది చిరంజీవిని కలవాలని ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అడుగుతుండేవారట. ఈ టైం లోనే చిరు అంటే పడని కొంతమంది చిరంజీవి ని చంపడానికి ప్లాన్ వేశారని తెలుస్తోంది. మరణ మృదంగం మూవీ చెన్నైలో షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక అభిమాని వచ్చి చిరు కాళ్లు పట్టుకున్నారు. ఈ రోజు నా పుట్టిన రోజు, నేను ఇక్కడే కేక్ కట్ చేస్తాను మీరు దగ్గర ఉండండి అని చిరు ని అడిగారు.
Advertisement
ఆయన పుట్టిన రోజు కాబట్టి చిరు కాదనలేక ఓకే అనేసారు. దీంతో కేక్ కట్ చేశారు. ఆ కేక్ పీస్ ను చిరంజీవి తినాలని బలవంతం చేసాడు అభిమాని. చిరు ఎంత చెప్పిన వినకుండా ఆ కేక్ తీసి నోట్లో పెట్టాడు. దీంతో చిరంజీవికి ఏదో తేడా కొట్టి దాన్నంతా బయట ఉమ్మేసాడు.అప్పుడే అక్కడ చాలా తోపులాట జరిగింది. ఆ కేక్ కిందపడిపోయింది.
అందులో ఏవో రంగు రంగుల పదార్థాలు కనిపించాయి. వెంటనే చిరంజీవి సెట్స్ పైకి వెళ్లి నోరు శుభ్రం చేసుకున్నారు. ఆ తర్వాత మేకప్ వేసే సమయంలో చిరు పెదాలు నీలి రంగులోకి మారడం సిబ్బంది గమనించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి చేర్చి,విషం లోపలికి వెళ్లకుండా వాంతులు అయ్యేలా టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ రాత్రంతా చిరంజీవి హాస్పిటల్ లో ఉన్నారు. ఒకరోజు తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.. అప్పట్లో ఈ వార్త మాత్రం సంచలనంగా మారింది.
also read:
- విమానంలో ప్రయాణించే వారికి గుడ్న్యూస్.. ఇక ఆ రుసుము చెల్లించాల్సిన అవసరమే లేదు..!
- ఎట్టకేలకు కార్తీకేయ 2 విడుదల తేది ఖరారు.. ఎప్పుడంటే..?