Home » పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి చిరంజీవి ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ? అసలేమయ్యింది…?

పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి చిరంజీవి ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ? అసలేమయ్యింది…?

by Azhar
Published: Last Updated on
Ad

మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు టాలీవుడ్ లో బ్రాండ్. ఈ ఒక్క కుటుంబం నుండే ఇప్పుడు మన టాలీవుడ్ లో అరడజను మందికి పైగా హీరోలు ఉన్నారు. అయితే దీని మొత్తానికి కారణం కేవలం చిరంజీవి ఒక్కడే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలోకి వచ్చి.. చాలా కష్టాలు పడి వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని హీరోగా ఎదిగాడు. తాను స్థిరపడిన తర్వాత తన తమ్ములు నాగబాబు, పవన్ కళ్యాణ్ ను కూడా రంగంలోకి దించాడు. అలా అలా ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం ఈ సినీ ప్రపంచంలోనే ఉంది.

chiranjeevi and pawan kalyan

chiranjeevi and pawan kalyan

 

అయితే చిరంజీవి హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన కొత్తలో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉండేవాడు. అందువల్ల ఆయన సినిమా షూటింగ్స్ ఎక్కువగా అక్కడే జరిగేవి. ఇలానే ఒకసారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అప్పుడు అక్కడ స్థానికంగా ఉండే కొంత మంది గుండాలు, ఆకతాయిలు షూటింగ్ దగ్గరకు వచ్చి చిరంజీవిని, డైరెక్టర్ ను అల్లరి చేస్తూ.. బూతులు తిట్టారట. కానీ దానిని చిరంజీవి పెద్దగా పట్టించుకోకపోయినా.. ఆయన డ్రైవర్ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకున్నాడు.

Advertisement

Advertisement

దాంతో ఆ షూటింగ్ దగ్గరకు వెళ్లి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని వారికీ వార్నింగ్ ఇచ్చాడు. కానీ వారు వినలేదు. దాంతో అప్పుడు కరాటేలో మంచి పట్టు ఉన్న పవన్ వారితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో అందులో ఒక్కరికి భారీగా గాయాలు అయ్యి ఆసుపత్రిలో చేరారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఆసుపత్రికి వెళ్లి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి ఈయన క్షమాపణలు చెప్పి.. వారి అవసరాలకు కొంత డబ్బు కూడా ఇచ్చాడట. అలాగే మళ్ళీ ఇలా గొడవలు పడకూడదు అని పవన్ దగ్గర మాట కూడా తీసుకున్నాడట చిరంజీవి.

ఇవి కూడా చదవండి :

2008 లోనే రిటైర్ అవుదాం అనుకున్న సెహ్వాగ్ ను అడ్డుకున్న సచిన్..!

ఆ 5 వేల మందికి అన్నం పెట్టడానికే నేను ఐపీఎల్ లో పని…

Visitors Are Also Reading