Home » ఫ్లాపులిచ్చిన హీరోయిన్ కోసం… ఎందుకు చిరు ఇంతలా ఎదురు చూస్తున్నారు…?

ఫ్లాపులిచ్చిన హీరోయిన్ కోసం… ఎందుకు చిరు ఇంతలా ఎదురు చూస్తున్నారు…?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యెక్కించి చెప్పక్కర్లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి ఈ స్థాయికి వచ్చి, మెగా ఫ్యామిలీలో చాలామందిని హీరోలుగా మార్చేశారు. చిరంజీవి భోళా శంకర్ సినిమా ఘోరంగా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం చిరు కొత్త ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. మెగా 156 మెగా 157 సినిమాలను కూడా అనౌన్స్ చేశారు. 156 సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తున్నారు. ఇక మెగా 157 అయితే బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి.

Advertisement

Advertisement

నవంబర్ లేదా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూట్ మొదలు కాబోతోంది ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. చిరంజీవి పక్కన హీరోయిన్ గా నయనతార నటించబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార మొన్న రిలీజ్ అయిన జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ పక్కన నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అయితే గాడ్ ఫాదర్, సైరా సినిమాల్లో నయనతార నటించినా ఆ సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. మళ్ళీ ఎందుకు ఆమెను సంప్రదిస్తున్నారని మెగా ఫాన్స్ అంటున్నారు హీరోయిన్ గా నయనతార ని వద్దని మెగా ఫాన్స్ సోషల్ మీడియా లో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు.

Also read:

Visitors Are Also Reading